Corona Virus: ఆ దేశంలో మూడో దశలో అడుగు పెట్టిన కరోనా వైరస్.. భారీ సంఖ్యలో కేసులు నమోదు.. యువతపైనే ఎక్కువ ప్రభావం
Corona Virus: చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను ఓ రేంజ్ లో వణికిస్తోంది. దాదాపు 18 నెలల నుంచి కరోనా వైరస్ వివిధ రూపాలను సంతరించుకుని.. తన ప్రభావం చూపిస్తూనే ఉంది...
Corona Virus: చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను ఓ రేంజ్ లో వణికిస్తోంది. దాదాపు 18 నెలల నుంచి కరోనా వైరస్ వివిధ రూపాలను సంతరించుకుని.. తన ప్రభావం చూపిస్తూనే ఉంది. ఓ వైపు అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ఇస్తూనే మరోవైపు కోవిడ్ కట్టడికోసం అనేక చర్యలు తీసుకుంటున్నాయి. చాలా దేశాలు సెకండ్ వేవ్ నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేస్తూనే.. థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి తగిన సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెక్సికో లో కరోనా వైరస్ మూడో దశ ప్రారంభమైందని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారి ప్రకటించారు. దీంతో మెక్సికో దేశ అధ్యక్షుడు ఆడ్రెస్ మానుయేల్ లోపెజ్ మూడో దశపై స్పందించారు. థర్డ్ వేవ్ ప్రభావం యువకులపైనే అధికంగా ఉంటుందని శాస్తవేత్తలు చెప్పరని .. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే కేసులు ఎంత భారీగా నమోదవుతాయో.. రికవరీ రేటు కూడా అదే విధంగా ఉంటుందని. బాధితుల్లో అత్యధికులు యువతే. వారిలో రోగనిరోధకశక్తి అధికంగా ఉండటం వల్ల మరణాల శాతం తక్కువగా ఉంది.
ఈ వారం గతవారంలో పోలిస్తే 29 శాతం కేసులు అధికంగా నమోదయ్యాయని తెలిపారు. 2020 సెప్టెంబర్‌లో రెండో దశ ప్రారంభం మైనప్పుడు నమోదైన కేసులస్తో పోలిస్తే.. మూడో దశలో చాలా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనగితే మెక్సికోలో కరోనా మూడో దశ ఆగష్టు నెలలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే ఇప్పటికే 2020 డిసెంబర్ నుంచి టీకాలు అందిస్తున్నారు. అందుకనే అక్కడ కరోనా బాధితులు ఎంతమంది ఉన్నా.. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నాయని చెప్పారు. మెక్సికోలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు అక్కడ మొత్తం 25,58,369 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా తో ఇప్పటి వరకూ 2,34,193 మంది మరణించారు.
Also Read: భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం..