AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జోరుమీద మెగాస్టార్.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ.. బాబీ సినిమా కూడా ఆన్ ద వే..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు మెగాస్టార్.

జోరుమీద మెగాస్టార్.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ.. బాబీ సినిమా కూడా ఆన్ ద వే..
Megastar
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 12, 2021 | 6:06 AM

Share

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు మెగాస్టార్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు వచ్చేసింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యింది. మరి కొన్నిరోజుల షూటింగ్ తో ఈ సినిమాను కంప్లీట్ చేయనున్నాడు మెగాస్టార్. ఈ సినిమాలో చిరు తోపాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత లూసిఫర్ రీమేక్ లో నటిస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలిగా నయన్ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమా తర్వాత తమిళ్ లో భారీ విజయాన్ని అందుకున్న వేదాళమ్ సినిమాను రీమేక్ చేయనున్నారు చిరు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలతోపాటు డైరెక్టర్ బాబీ తో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే మెగాస్టార్ కమిట్ అయిన విషయం తెలిసిందే.

అటు మెగాస్టార్ తో మూవీ కోసం డైరెక్టర్ బాబి కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ కి స్క్రిప్ట్ వినిపించి లాక్ చేసాడు. బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేసాడు. ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నట్లు తెలిపాడు బాబీ. అలాగే మెగాస్టార్ ని ఓ అభిమానిగా డైరెక్ట్ చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు. చిరంజీవిని చూసి ఎన్నో విషయాలు..ఎంతో నేర్చుకున్నట్లు బాబీ చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

నారప్ప నీదారెటప్పా… వెంకీ సినిమా పై వీడని కన్ఫ్యూజన్.. ఓటీటీనా..? లేక థియేటర్స్ లోనా .?

Vishal: పప్పులో కాలేసిన హీరో విశాల్ .. ఆడుకున్న నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే..

Acor Suman: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సీనియర్ హీరో సుమన్

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..