Acor Suman: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సీనియర్ హీరో సుమన్
Acor Suman: దక్షిణాది సీనియర్ నటుడు సుమన్ కు అరుదైన గౌరవం లభించింది. భారత దేశంలో సినీ ప్రముఖులకు ఇచ్చి అత్యంత ప్రతిష్టాత్మ అవార్డు 'దాదా సాహెబ్ ఫాల్కే' పురస్కారం..
Acor Suman: దక్షిణాది సీనియర్ నటుడు సుమన్ కు అరుదైన గౌరవం లభించింది. భారత దేశంలో సినీ ప్రముఖులకు ఇచ్చి అత్యంత ప్రతిష్టాత్మ అవార్డు ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారం ఈసారి సుమన్ ను వరించింది. ఆదివారం ముంబై లో జరిగిన పురష్కారా ప్రదానోత్సవం జరిగింది. ఈ వేడుకలో దక్షిణాది నుంచి సుమన్ ఈ పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు ను దాదా సాహెబ్ మనవడు చంద్రశేఖర్.. సుమన్‌కు అందజేశారు తనకు దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు దక్కడంపై సుమన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నటుడిగా తన ఎదుగుదల కు సహకరించిన ప్రతి ఒక్కరికి సుమన్ కృతఙ్ఞతలు తెలిపారు.
కర్ణాటకకు చెందిన సుమన్ యాక్షన్ హీరోగా వెండి తెరపై అడుగు పెట్టారు. హీరో, సహాయ నటుడు, విలన్ ఇలా ఏ పాత్రనైనా సరే సుమన్ తనదైన శైలి నటిస్తూ ప్రేక్షకులను కట్టుకున్నారు. ఇక అన్నమయ్య సినిమాలో ‘వేంకటేశ్వరస్వామి’ గా, రామదాసు లో శ్రీరాముడిగా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇక శివాజీ సినిమాలో సుమన్ పండించిన విలనిజం మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. సుమన్ ఇప్పటి వరకూ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 150కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కథా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. సుమన్ శిరీష ని పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు ఒక కుమార్తె. నటుడిగానే కాదు రాజకీయాల్లో కూడా సుమన్ తనదైన ముద్ర వేశారు.
Also Read: ఈ 85 ఏళ్ల బామ్మగారికి ఫన్నీగా ప్రేమించడానికి 36 ఏళ్ల యువకుడు కావాలట ..