AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishal: పప్పులో కాలేసిన హీరో విశాల్ .. ఆడుకున్న నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే..

సోషల్ మీడియాలో ఏ చిన్న విషయమైన అది పెద్ద సంచలనం గా మారుతుంది. సెలబ్రేటీల విషయంలో మరీను..

Vishal: పప్పులో కాలేసిన హీరో విశాల్ .. ఆడుకున్న నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే..
Vishal
TV9 Telugu Digital Desk
| Edited By: Rajeev Rayala|

Updated on: Jul 11, 2021 | 11:53 PM

Share

Vishal: సోషల్ మీడియాలో ఏ చిన్న విషయమైన అది పెద్ద సంచలనం గా మారుతుంది. సెలబ్రేటీల విషయంలో మరీను.. వారిపై ప్రశంసలు కురిపించే నేటిజన్లే తేడావస్తే ట్రోలింగ్ తో ఆడుకుంటారు. పొరపాటున నోరు జారి ఏదైనా అన్నారో ఖాతం ట్రోల్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తారు. ఇప్పుడు అలాంటి ట్రోలింగ్ నే ఎదురుకుంటున్నాడు తమిళ్ స్టార్ హీరో విశాల్. ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ను కలిశారు విశాల్. ఆయన తోపాటుగా విశాల్ సోదరి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ గురించి, సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, సమాజిక సేవ పై ఆయనతో చర్చించినట్లు విశాల్ తెలిపారు. ఈ విషయాన్నీ అబిమనులతో పంచుకోవాలన్న కుతూహలం లో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇక్కడే విశాల్ ట్రోల్ లో కాలేశారు. వెంకయ్య నాయుడిని కలిసిన సమయంలో తీసిన ఫోటోను షేర్ చేసిన విశాల్. కంగారులో వెంకయ్య నాయుడిని రాష్ట్రపతి అని రాసుకోచ్చారు.ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలిసి సందర్భంగా రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలవడం సంతోషంగా ఉందన్న హీరో విశాల్. అంతే ఎవరికీ దొరకకుడదో వాళ్ళకే దొరికారు. వెంటనే ట్రోలింగ్ ను షూరూ చేశారు. వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కాదు. నాయన ఆయన ఉప రాష్ట్రపతి అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. దాంతో తప్పుతెలుసుకున్న విశాల్ వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేసి మరో పోస్ట్ ను షేర్ చేశాడు. ఏది ఏమైనా తప్పు చేసి నెటిజన్లకు దోర్కకుడదబ్బా…

మరిన్ని ఇక్కడ చదవండి :

Acor Suman: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సీనియర్ హీరో సుమన్

Nagarjuna OTT: ఓటీటీ వార్తలపై స్పందించిన నాగార్జున.. త్వరలోనే ఓ ప్రయోగత్మక సినిమాలో నటించనున్నట్లు.

Ajith Valimai: అజిత్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కార్తికేయ.. ఆకట్టుకుంటోన్న వలిమై ఫస్ట్‌లుక్‌. అభిమానులకు పండగే.