Nagarjuna OTT: ఓటీటీ వార్తలపై స్పందించిన నాగార్జున.. త్వరలోనే ఓ ప్రయోగత్మక సినిమాలో నటించనున్నట్లు.
Nagarjuna OTT: ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో ప్రేక్షకులు ఓటీటీలకు మొగ్గు చూపుతున్నారు. ఇక బడా నిర్మాణ సంస్థలు కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టడం, స్టార్ నటీనటులు..
Nagarjuna OTT: ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో ప్రేక్షకులు ఓటీటీలకు మొగ్గు చూపుతున్నారు. ఇక బడా నిర్మాణ సంస్థలు కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టడం, స్టార్ నటీనటులు కూడా నటిస్తుండడంతో ఓటీటీకి ఆదరణ బాగా పెరిగింది. ఇక ఈ ఓటీటీలు ప్రత్యేకంగా కొన్ని వెబ్ సిరీస్‌లను తెరకెక్కించడంతోపాటు సినిమాలను సైతం విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే అల్లు అరవింద్ తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ను తీసుకొచ్చిన విషం తెలిసిందే. ఇక టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కూడా ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టనున్నాడని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై నాగ్ అధికారికంగా స్పందించలేరు. అంతేకాకుండా నాగ్ ఓటీటీ వేదికగా రానున్న ఓ సినిమాలో నటించనున్నారని కూడా వార్తలు షికార్లు చేశాయి.
ఇదిలా ఉంటే ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టడంపై స్పందించని నాగార్జున.. ఓటీటీ వేదికగా విడుదల కానున్న సినిమాపై మాత్రం తాజాగా రెస్పాండ్ అయ్యారు. త్వరలోనే ఓ ప్రయోగాత్మక సినిమాలో నటించనున్నానని, ఆ సినిమాలో ఓటీటీ వేదికగా విడుదలైతేనే బాగుంటుందని నాగ్ అభిప్రాయపడ్డారు. ఈ సినిమా విషయమై నాగ్ మాట్లాడుతూ.. ‘ఓ సినిమా ప్రాజెక్టు గురించి అనుకున్నాం. ప్రస్తుతం దానిపై వర్కవుట్ జరుగుతోంది. బయట చర్చ జరుగుతున్నట్లుగానే ఈ సినిమా ఓటీటీ వేదికగానే విడుదల కానుంది. ఓటీటీ అనేది నాకు కొత్తది, అందుకే ప్రయోగాలు చేయాలనుకుంటున్నాను. సినిమాల్లో నేను ఇప్పటి వరకు చేయనిది ఇందులో చేయబోతున్నాను’ అంటూ ఆసక్తిని పెంచేశారు నాగ్.