Ajith Valimai: అజిత్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన కార్తికేయ.. ఆకట్టుకుంటోన్న వలిమై ఫస్ట్‌లుక్. అభిమానులకు పండగే.
Ajith Valimai: తమిళ టాప్ హీరో అజిత్ అభిమానులు ఆయన కొత్త సినిమా 'వలిమై' కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో...
Ajith Valimai: తమిళ టాప్ హీరో అజిత్ అభిమానులు ఆయన కొత్త సినిమా ‘వలిమై’ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆయన ఫ్యాన్స్ ఢీలా పడ్డారు. అయితే తాజాగా వారి ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర యూనిట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. నిజానికి అజిత్ పుట్టిన రోజు సందర్భంగా వలిమై నుంచి అజిత్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అప్పట్లో ప్రకటించింది. అయితే పరిస్థితులు కుదరకపోయేసరికి అప్పట్లో వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఏట్టకేలకు సినిమా అప్‌డేట్ వచ్చేసింది.
Kudos to the unlimited patience of fans..The 2year long wait is over .#Thaladarsinam is here.. Ippo podra vediya??#Valimaihttps://t.co/uyt0Y2OJys
— Kartikeya (@ActorKartikeya) July 11, 2021
ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో కార్తికేయ సాయంత్రం ఆరు గంటలకు సర్ ప్రైజ్ అంటూ ట్వీట్ చేసి అందరిలో ఆసక్తిని పెంచేశారు. దీంతో అజిత్ ఫ్యాన్స్ అంతా ట్వీట్ కోసం ఎదురు చూశారు. అన్న ప్రకారమే కార్తికేయ్ సమయానికి ట్వీట్ చేశారు. ఇక వలిమై ఫస్ట్ లుక్ విషయానికొస్తే.. ‘పవర్ ఇజ్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్’ అన్న కాన్సెప్ట్‌తో రూపొందించిన వీడియో ఆకట్టుకుంటోంది. ఇందులో అజిత్ రేసర్ లుక్‌లో అదరగొట్టారు. ఫస్ట్ లుక్ చూస్తుంటే సినిమా కచ్చితంగా ఒక వండర్ ఫుల్ విజువల్ ట్రీట్‌లా ఉండేలా కనిపిస్తోంది. ఫస్ట్‌లుక్ చూసిన అజిత్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కార్తికేయ విలన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగులో నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ చిత్రంలో నెగిటివ్ రోల్‌లో ఆకట్టుకున్న కార్తికేయ.. ఏకంగా అజిత్ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేశారు.