చాణక్య నీతి: భార్యాభర్తల మధ్య ఈ విషయాల ప్రస్తావన రాకూడదు.. వచ్చిందంటే బంధం బలహీనం..?
చాణక్య నీతి: ఆచార్య చాణక్యుడు గొప్ప జీవిత కోచ్‌గా పేరుగాంచాడు. తన ప్రత్యేక విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. గొప్ప వ్యూహకర్తగా
చాణక్య నీతి: ఆచార్య చాణక్యుడు గొప్ప జీవిత కోచ్‌గా పేరుగాంచాడు. తన ప్రత్యేక విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. గొప్ప వ్యూహకర్తగా భావించే చాణక్యుడి వల్ల నంద వంశం నాశనమైంది. చాణక్యుడికి రాజకీయాలకే కాకుండా సమాజానికి సంబంధించిన ప్రతి విషయంపై లోతైన జ్ఞానం ఉంది. ఆచార్య చాణక్య నీతి శాస్త్రం అనే పుస్తకంలో వైవాహిక జీవితానికి సంబంధించి చాలా విషయాల గురించి ప్రస్తావించాడు. ఇవి నేటి కాలానికి కూడా వర్తిస్తాయి. చాణక్యుడి ప్రకారం వైవాహిక జీవితాన్ని ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం.
1. మోసం ఉండకూడదు
మోసం చేయడం విషం లాంటిదని చాణక్యుడు తన నీతి గ్రంథంలో పేర్కొన్నాడు. భార్యాభర్తలే కాదు ఏ సంబంధంలో మోసం ఉండకూడదన్నారు. భార్యాభర్తలు తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవాలంటే జీవితంలో ఒకరినొకరు ఎప్పుడు మోసం చేసుకోవద్దన్నారు.
2. అబద్ధం
భార్యాభర్తల సంబంధంలో అబద్ధాలకు ఆస్కారం ఉండకూడదని చెప్పారు. ఎందుకంటే ఒక విషయం అబద్ధమని తేలితే బంధం బలహీనపడటం ప్రారంభమవుతుందన్నారు. కాబట్టి అబద్ధానికి దూరంగా ఉండటం మంచిది. భార్యాభర్తలు ఒకరికొకరు అంకితభావంతో ఉండాలి.
3. ఇద్దరు సమానమే
భార్యా భర్తలు ఇద్దరు సమానమే. ఇందులో ఎవరు ఎక్కువకాదు ఎవరు తక్కువ కాదు. ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించుకోవాలని ప్రయత్నిస్తే వివాహం బంధం దెబ్బతింటుందని చెప్పారు. భార్యాభర్తలు ఎల్లప్పుడూ ఒకరినొకరు సమానంగా భావించాలి ఇలా చేయడం ద్వారా బంధంలో మాధుర్యం ఉంటుంది.
4. కోపం
ఆచార్య చాణక్యుడి ప్రకారం కోపం ఏదైనా సంబంధాలను బలహీనపరుస్తుంది. వైవాహిక జీవితంలో భర్త లేదా భార్య ఎల్లప్పుడూ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వాస్తవానికి కోపంతో చేసే పనులు అందరిని బాధపెడుతాయి. అందువల్ల కోపం తెచ్చుకునే బదులు ఆలోచించడం, అర్థం చేసుకుంటే మంచిది.