- Telugu News Photo Gallery Viral photos Interesting facts about russian tembulat erkenov which was prepared by the businessman
Viral Photos: రష్యాలోని టెంబులాట్ ఎర్కెనోవ్ కోట చాలా ఫేమస్.. దీనిని ఒక వ్యాపారవేత్త నిర్మించారు..?
Viral Photos: కోటల పేరు వినగానే రాజులు, చక్రవర్తులు గుర్తుకొస్తారు. ఎందుకంటే ప్రపంచంలో పెద్ద పెద్ద కోటలు వారి కాలంలో నిర్మించినవే.
Updated on: Feb 05, 2022 | 4:36 PM

కోటల పేరు వినగానే రాజులు, చక్రవర్తులు గుర్తుకొస్తారు. ఎందుకంటే ప్రపంచంలో పెద్ద పెద్ద కోటలు వారి కాలంలో నిర్మించినవే. అయితే రాజులకు, చక్రవర్తులకు సంబంధం లేని కోట కూడా ఒకటి ఉంది. దాని పేరు టెంబులాట్ ఎర్కెనోవ్.

రష్యాకు చెందిన టెంబులాట్ ఎర్కెనోవ్ కోటని కబార్డినో-బల్కారియా అనే ప్రాంతంలో నిర్మించారు. దీన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉండే సరస్సు సహజమైనది కాదు కృత్రిమమైనది. కేవలం కోట కోసమే నిర్మించారు.

ఈ కోట చాలా పాతదైనప్పటికీ సరస్సు నీటిలో నిలబడి ఈ కోటను చూస్తే మధ్యయుగ యురోపియన్ కోట ముద్ర కనిపిస్తుంది. ఈ కోటను ప్రసిద్ధ రష్యన్ వ్యాపారవేత్త టెంబులాట్ ఎర్కెనోవ్ నిర్మించాడు.

టెంబులాట్ ఎర్కెనోవ్ సొంత వైనరీని కూడా నిర్మించాడు. ఇది రష్యాలోని ఉత్తమ వైన్ తయారీ కేంద్రాలలో ఒకటి. 2017 సంవత్సరంలో ఎర్కెనెవ్ మరణించిన తరువాత అతని కుమారుడు ఈ కోటను చూసుకున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా కోటలు నిర్మించడానికి దశాబ్దాలు పట్టినా ఈ కోట కేవలం రెండేళ్లలో నిర్మించారు. కోటలో మొత్తం 5 అంతస్తులు ఉన్నాయి.



