- Telugu News Photo Gallery Viral photos Man earned a guinness world record by getting 864 tattoos of insects on his body
Viral Photos: ఇదేం పిచ్చి బాబు.. శరీరంపై 800 కీటకాల టాటూలు.. గిన్నీస్ రికార్డ్..?
Viral Photos: ఒకప్పుడు శరీరంపై చిన్నగా, సింపుల్ గా పచ్చబొట్టు వేయించుకోవాలంటేనే భయపడిపోయేవారు కానీ నేడు శరీరంపై పెద్ద పెద్ద టాటూలు వేసుకుని తిరుగుతున్నారు.
Updated on: Feb 04, 2022 | 7:55 PM

ఒకప్పుడు శరీరంపై చిన్నగా, సింపుల్ గా పచ్చబొట్టు వేయించుకోవాలంటేనే భయపడిపోయేవారు కానీ నేడు శరీరంపై పెద్ద పెద్ద టాటూలు వేసుకుని తిరుగుతున్నారు. అంతేకాదు ఓ వ్యక్తి ఏకంగా టాటూలు వేయించుకొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లోకి ఎక్కాడు.

ఈ వ్యక్తి పేరు మైఖేల్ అమోయా. ఇతను అమెరికాలోని న్యూయార్క్ నివాసి. తన శరీరంపై 864 క్రిమికీటకాల టాటూలు వేయించుకుని గిన్నిస్ రికార్డు సృష్టించాడు.

మైఖేల్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. అతను కీటకాలను అసహ్యించుకుంటానని చెప్పాడు. కానీ ప్రజలు కీటకాల పచ్చబొట్లని చూసి అతను కీటకాలను ఇష్టపడతాడని అర్థం చేసుకుంటారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం మైఖేల్ కంటే ముందు శరీరంపై ఎక్కువ కీటకాల టాటూలు వేయించుకున్న వ్యక్తి బాక్స్టర్ మిల్సోమ్. అతని శరీరంపై మొత్తం 402 కీటకాల పచ్చబొట్లు ఉండేవి.

మైఖేల్ తన 21 సంవత్సరాల వయస్సులో శరీరంపై పచ్చబొట్లు వేసుకోవడం ప్రారంభించాడు. ముందుగా తన చేతిపై ఎర్ర చీమల పచ్చబొట్టు వేయించుకున్నాడు. తరువాత అతను టాటూలతో ఎంతగానో ప్రేమలో పడ్డాడు. మొత్తం శరీరాన్ని టాటూలతో కప్పుకున్నాడు.



