AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chili Powder: కారంపొడితో చాలా ప్రమాదం.. అతిగా వాడితే ఈ రోగాలు..?

Chili Powder: మనలో చాలామంది తరచూ స్పైసీ ఫుడ్‌ కోసం వెంపర్లాడుతుంటారు. అందుకోసం వేడిగా, కారంగా ఉండే ఆహారాలను బాగా ఇష్టపడుతారు.

Chili Powder: కారంపొడితో చాలా ప్రమాదం.. అతిగా వాడితే ఈ రోగాలు..?
Chili Powder
uppula Raju
|

Updated on: Feb 05, 2022 | 4:18 PM

Share

Chili Powder: మనలో చాలామంది తరచూ స్పైసీ ఫుడ్‌ కోసం వెంపర్లాడుతుంటారు. అందుకోసం వేడిగా, కారంగా ఉండే ఆహారాలను బాగా ఇష్టపడుతారు. ఇది తిన్న తర్వాత జరిగే అనర్థాలను గ్రహించరు. కారం దుష్ప్రభావాలు తెలియక చాలామంది ఎక్కువగా తింటారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఎర్ర మిరపకాయల కారం ఎక్కువగా తీసుకుంటే గుండెల్లో మంట, జీర్ణ సమస్యలు ఏర్పడుతాయి. ఇది ఇక్కడితో ముగియదు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కారంపొడి ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలుసుకుందాం.

1. అతిసారం

కారంపొడి ఎక్కువగా తీసుకుంటే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతాయి. నిజానికి స్పైసీ ఫుడ్ ఒక వ్యక్తి ఆహారంలోని పోషకాలను నాశనం చేస్తుందని, వివిధ జీర్ణ సమస్యలకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా కొన్ని సందర్భాల్లో డయేరియా వంటి అనారోగ్యాలు కూడా వస్తాయి. ఇది కాకుండా ఎర్ర కారం పొడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు వికారంగా అనిపించవచ్చు.

2. నోట్లో పొక్కులు

కారంపొడి ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటిపూత వస్తుంది. అసలైన ఎర్ర మిరపకాయ చాలా కారంగా ఉంటుంది. కారంపొడిని క్రమం తప్పకుండా ఎక్కువగా  తీసుకోవడం వల్ల నోట్లో పొక్కులు ఏర్పడుతాయి.

3. ఆస్తమాకు హానికరం

ఎర్ర మిరపకాయలను ఎక్కువగా తినడం వల్ల ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది.  ఇందులో ఉండే పదార్థాలు ఆస్తమా లేదా శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి ప్రమాదకరంగా మారుతాయి.

4. అకాల శ్రమ

గర్భధారణ సమయంలో ఎర్ర మిరపకాయలను ఎక్కువగా తినడం వల్ల శిశువుకు శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. కాబట్టి గర్భిణులు కారంపొడి ఎక్కువగా వాడకూడదు.

5. కడుపు పూతలు

కారంపొడిని ఎక్కువగా తింటే కడుపులో అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి చాలా ప్రాణాంతకం. ఎర్ర మిరపకాయలో అఫ్లాటాక్సిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది కొన్ని సందర్భాల్లో కడుపులో పుండు, లివర్ సిర్రోసిస్, పెద్దప్రేగు క్యాన్సర్‌కి దారి తీస్తుంది.

IND vs WI: మొదటి వన్డే ప్లేయింగ్ XIలో ఈ 11 మంది ఆటగాళ్లు.. రోహిత్‌ శర్మ స్పష్టమైన సంకేతం..

JIO Users: జియో సేవలకు అంతరాయం.. ఆ సర్కిల్‌లో కాల్‌ కనెక్ట్‌ కావడం లేదు..?

Hair Care: జుట్టుకి ఆయిల్‌ రాసేటప్పుడు ఈ 4 తప్పులు అస్సలు చేయకూడదు.. అవేంటంటే..?