JIO Users: జియో సేవలకు అంతరాయం.. ఆ సర్కిల్‌లో కాల్ కనెక్ట్ కావడం లేదు..?
JIO Users: ముంబై టెలికాం సర్కిల్‌లో రిలయన్స్ జియో నెట్‌వర్క్ డౌన్ అయినట్లు సమాచారం. జియో నంబర్‌ల నుంచి ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్
JIO Users: ముంబై టెలికాం సర్కిల్‌లో రిలయన్స్ జియో నెట్‌వర్క్ డౌన్ అయినట్లు సమాచారం. జియో నంబర్‌ల నుంచి ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ ఏవి కనెక్ట్ కావడం లేదని యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాద్యమాల ద్వారా తమ ఇబ్బందిని తెలియజేస్తున్నారు. ట్విట్టర్‌లో చాలా మంది జియో వినియోగదారులు జియో నంబర్‌లతో ఏ కాల్ కనెక్ట్ కావడం లేదని నివేదించారు. ఇతర నెట్‌వర్క్ వాళ్లు కూడా జియో నెంబర్లకు కాల్ చేస్తే కలవడం లేదని ఆరోపిస్తున్నారు.
జియో అంతరాయానికి కచ్చితమైన కారణాన్ని ధృవీకరించలేదు. అధికారికంగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ముంబై టెలికాం సర్కిల్ వెలుపల ఉన్న ఇతర ప్రాంతాల్లోని జియో నెట్‌వర్క్‌లు ఇటువంటి అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయో లేదో ప్రస్తుతం తెలియదు. జియో అంతరాయాన్ని పరిష్కరించే వరకు జియో కస్టమర్లు కమ్యూనికేషన్ కోసం ప్రత్యామ్నాయ నెంబర్లపై ఆధారపడాల్సి ఉంటుంది.అది సాధ్యం కాకపోతే సమీపంలోని WiFi నెట్‌వర్క్‌కి లేదా WhatsApp కాల్స్ వంటి ఇంటర్నెట్ ఆధారిత కాలింగ్ సేవలను ఉపయోగించవచ్చు.
Is there some problem with @reliancejio network in Kalyan area? Am unable to get network for last 20 mins.
— Singh Varun (@singhvarun) February 5, 2022
#Jio network gone completely anyone else?
— Sumer (@sumer_world) February 5, 2022