Statue Of Equality: ఆహ్వానానికి ధన్యవాదాలు.. సమానత్వం కోసం పోరాడేందుకు మేం ముందుంటాం: తమిళనాడు సీఎం

ఈ ఉత్సవాలకు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు. సమాజయంలో సమానత్వం కోసం చేసే ఇలాంటి కార్యక్రమంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Statue Of Equality:  ఆహ్వానానికి ధన్యవాదాలు.. సమానత్వం కోసం పోరాడేందుకు మేం ముందుంటాం: తమిళనాడు సీఎం
Tamilnadu Cm Mk Stalin
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 05, 2022 | 4:47 PM

Ramanujacharya Sahasrabdi: 216 అడుగుల స‌మతాముర్తి విగ్రహాన్ని జాతికి అంకితం ఇచ్చేందుకు ప్రధానమంత్రి న‌రేంద్రమోదీ(PM Narendra Modi) హైద‌రాబాద్ వ‌స్తున్న సంగతి తెలిసిందే. ఈమేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌(Telangan CM KCR)తోపాటు అధికారులు, పోలిసులతో సహా 20 మంది ప్రముఖ‌లు మోదీకి స్వాగ‌తం పలికేందుకు శంషాబాద్ విమానాశ్రాయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, రామనుజాచార్యుల సహస్రాబ్ది(Ramanujacharya Sahasrabdi) సమారోహ ఉత్సవాల్లో పాల్గొనేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌‌(Tamilnadu MK Stalin)కు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ మేరకు ఎంకే స్టాలిన్ ట్విట్టర్లో స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సవాలకు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు. సమాజయంలో సమానత్వం కోసం చేసే ఇలాంటి కార్యక్రమంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రామనుజాచార్యులు సాంస్కృతిక, లింగ, విద్య, ఆర్థిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, సమాజంలో వివక్షకు గురైన వారికి దేవాలయాల తలుపులు తెరిచాడని ఆయనే పేర్కొన్నారు. మేం కూడా మా ప్రభుత్వాన్ని కూడా అలాగే ముందుకు నడిపిస్తున్నామని తెలిపారు.

13 రోజుల పాటు ఉత్సవాలు..

రామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల సందర్భంగా 13 రోజుల కార్యక్రమం నిర్వహించనున్నారు. ముచ్చింతల్‌ క్షేత్రంలో ఫిబ్రవరి 2 న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి. సమతా మూర్తి భూమిపై అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా.. సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్రమంత్రులు, తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. పద్మపీఠంపై పద్మాసనంలో కూర్చున్న భంగిమలో ఉన్న 216 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. అలాగే, ఫిబ్రవరి 13న 120 కిలోల బంగారు రామానుజాచార్య బంగారు విగ్రహాన్నిరాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది.

Also Read: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సీన్.. ప్రత్యక్షంగా కలుసుకోనున్న సీఎం కేసీఆర్, బండి సంజయ్..

Statue Of Equality: సమతా తరంగిణి.. తెలంగాణ సిగలో సమతామూర్తి నిలువెత్తు విగ్రహం.. పలు ఆసక్తికర విషయాలు..