Lucky Plants : రాశిచక్రం ప్రకారం ఈ చెట్లు నాటితే కొరుకున్నది జరుగుతుందట.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..

Lucky Plants : హిందూమతంలో చెట్లను మొక్కలను దేవుడిలా పూజిస్తారు. జీవితానికి వరంలా భావించే చెట్లు, మొక్కలు మన ఆరోగ్యంతోనే కాదు..

Lucky Plants : రాశిచక్రం ప్రకారం ఈ చెట్లు నాటితే కొరుకున్నది జరుగుతుందట.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..
Lucky Plants
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 05, 2022 | 10:03 PM

Lucky Plants : హిందూమతంలో చెట్లను మొక్కలను దేవుడిలా పూజిస్తారు. జీవితానికి వరంలా భావించే చెట్లు, మొక్కలు మన ఆరోగ్యంతోనే కాదు.. అదృష్టంతో కూడా ముడిపడి ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలకు సంబంధించిన దోషాలను తొలగించి, ఐశ్వర్యం పొందడానికి రక రకాల రత్నాలను ధరించినట్లే, తొమ్మిది గ్రహాలకు సంబంధించిన చెట్లు, మొక్కలు నాటినా ప్రభావం ఉంటుంది. రాశి ప్రకారం మొక్కలు నాటిని వారికి గ్రహ దోషాలు తొలగి.. మంచి జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఏ రాశి వారు ఏ మొక్క నాటాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మేషరాశి.. ఈ రాశికి అధిపతి అంగారకుడు. శుభ ఫలితాలను పొందడానికి ఎర్రటి పువ్వులతో కూడిన మొక్కలను నాటాలి. అలాగే, ఎర్రచందనం, ఉసిరి, చింతపండు మొదలైన వాటిని నాటడం ద్వారా సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, అదృష్టాన్ని పొందుతారు.

వృషభ రాశి.. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు తెల్లటి పువ్వులు పూసే మొక్కలను నాటాలి. అలాగే బెర్రీ ట్రీ, చింతపండు, ఖైర్ మొక్కలు నాటడం ద్వారా ఆర్థిక పురోగతి, ఆనందం, ఆస్తి లభిస్తుంది.

మిథున రాశి.. మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి ప్రజలు తులసి, రోజ్‌వుడ్, వెదురు చెట్లను నాటడం ద్వారా జీవితంలో కోరుకున్న విజయాలు, అదృష్టం పొందుతారు.

కర్కాటక రాశి.. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారు తులసి, వేప, మొదలైన ఔషధ మొక్కలను నాటాలి. అలాగే వెదురు, పీపల్ చెట్టును నాటడం శుభప్రదం.

సింహ రాశి.. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. ఈ రాశి వారు.. ఎర్రటి పూలతో కూడిన చెట్లను నాటాలి. కుంకుమపువ్వు, మర్రి, ధాక్ మొదలైన చెట్లను కూడా నాటాలి.

కన్యా రాశి.. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వారు.. తులసి, రోజ్‌వుడ్, వెదురు చెట్లతో పాటు, పూలు, పండ్లు కాసే చెట్లను నాటితే శుభం జరుగుతుంది.

తులా రాశి.. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు తెల్లని పువ్వులు పూసే చెట్లను నాటాలి. రీత, బెల్, అర్జున మొక్కను నాటడం శుభ ఫలితాలను ఇస్తుంది.

వృశ్చిక రాశి.. ఈ రాశికి అధిపతి భూమిపుత్ర మంగళదేవుడు. వృశ్చిక రాశి వారు ప్రత్యేకంగా ఎరుపు రంగు పువ్వులు పూసే చెట్లను నాటాలి. అర్జునుడు, మొళేశ్రీ మొక్కను నాటడమే కాకుండా దానం కూడా చేస్తే మంచి జరుగుతుంది.

ధనుస్సు రాశి.. ఈ రాశికి అధిపతి దేవగురువు బృహస్పతి. పసుపు రంగులో పూసే పువ్వుల మొక్కలను నాటాలి. మోల్శ్రీ, పైన్, సలాల్ వంటి చెట్లను నాటడం కూడా శుభప్రదం.

మకర రాశి.. ఈ రాశికి అధిపతి శని దేవుడు. శనిదేవుని అనుగ్రహం పొందడానికి మకరరాశి వారు ప్రత్యేకంగా శమి చెట్టు వంటి నీలం రంగు పుష్పాలు పూసే చెట్లను నాటాలి. దీంతో పాటు, వీరు తమ ఇంటి పెరట్లో సాల్, జాక్‌ఫ్రూట్, జల్వేటాస్ మొక్కలను నాటడం కూడా శుభప్రదం.

కుంభ రాశి.. ఈ రాశికి అధిపతి కూడా శని దేవుడే. శనిదేవుని అనుగ్రహం పొందడానికి కుంభరాశి వారు ప్రత్యేకంగా శమి వృక్షం నాటాలి. దీంతో పాటు ఇంటి బయట మదార్, కదంబ వంటి చెట్లను నాటినా శుభ ఫలాలు లభిస్తాయి.

మీన రాశి.. మీన రాశికి బృహస్పతి అధిపతి. ఈ రాశి ప్రజలు.. పసుపు పువ్వులు పూసే మొక్కలు లేదా పండ్ల మొక్కలను నాటాలి. మామిడి, మహువా మొదలైన వాటిని నాటితే శుభ ఫలితాలు కలుగుతాయి.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రజల సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది.)

Also read:

Pushpa: రోజురోజుకూ పెరుగుతోన్న పుష్ప క్రేజ్‌.. రైల్వే శాఖ కూడా బన్నీ సినిమాను వాడేసిందిగా..

India vs West Indies: మూడంకెల ముచ్చట తీరేనా? కోహ్లీ సెంచరీతో ఆ దిగ్గజాల స్పెషల్ రికార్డులకు బ్రేకులు..!

Viral Video: వామ్మో.. ఇదేం టాలెంట్ రా బాబు.. ఊ అంటావా పాటను ఇలా చేశారేంటీ..