AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: రోజురోజుకూ పెరుగుతోన్న పుష్ప క్రేజ్‌.. రైల్వే శాఖ కూడా బన్నీ సినిమాను వాడేసిందిగా..

Pushpa- South Central Railway: రోజురోజుకూ పెరుగుతోన్న పుష్ప క్రేజ్‌.. దక్షిణ మధ్య రైల్వే కూడా బన్నీ సినిమాను వాడేసిందిగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన ‘పుష్ప’ (Pushpa) క్రేజ్‌ రోజురోజుకూ పెరుగుతోంది.

Pushpa: రోజురోజుకూ పెరుగుతోన్న పుష్ప క్రేజ్‌.. రైల్వే శాఖ కూడా బన్నీ సినిమాను వాడేసిందిగా..
Basha Shek
|

Updated on: Feb 05, 2022 | 12:12 PM

Share

South Central Railway: రోజురోజుకూ పెరుగుతోన్న పుష్ప క్రేజ్‌.. దక్షిణ మధ్య రైల్వే కూడా బన్నీ సినిమాను వాడేసిందిగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన ‘పుష్ప’ (Pushpa) క్రేజ్‌ రోజురోజుకూ పెరుగుతోంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని పాటలు, డైలాగులు, సీన్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దేశ విదేశాల్లోని సంగీత కళాకారులు, క్రికెటర్లు ఈ సినిమాల్లోని పాటలు, డైలాగులను రీక్రియేట్‌ చేస్తూ మెప్పిస్తున్నారు. ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ ఈ సినిమాలోని శ్రీవల్లి ట్యూన్‌ను వాడుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు హైదరాబాద్ పోలీసులు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిపించేందుకు పుష్ప డైలాగులను వినియోగించుకున్నారు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కూడా బన్నీ సినిమాను వాడేసింది. ఇందులో భాగంగా తగ్గేదేలే అన్న డైలాగ్‌ను ఇమిటేట్‌ చేస్తూ ‘రైలు పట్టాలు/ట్రాక్‌లపై నడిచదేలే’ అని అల్లు అర్జున్‌ పోస్టర్‌ పై రాసుకొచ్చింది. అనంతరం తమ అధికారిక ట్విట్టర్‌ లో ఈ పోస్టర్‌ను షేర్‌ చేస్తూ ‘ ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యం. రైలు పట్టాలపై నడవడం కానీ దాటడం కానీ చేయవద్దు. FOB (ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీ) లేదా సబ్ వేలను ఉపయోగించండి’ అని క్యాప్షన్‌ ఇచ్చింది.

కాగా పుష్ప సినిమాలో రష్మిక మందనా హీరోయిన్‌గా నటించగా, సమంత స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. అనసూయ, సునీల్, ఫాహద్‌ పాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్‌ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మొత్తం రూ.365 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ అందించిన పాటలు చార్ట్‌ బస్టర్‌గా నిలిచాయి. యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొట్టాయి. ఇక సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాకు క్రేజ్‌ మరింత పెరిగింది. ఇక త్వరలోనే ఈ సినిమా సీక్వెల్‌ ‘పుష్ప-దిరూల్‌’ షూటింగ్‌ కూడా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటివారంలో ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Also Read:Viral Video: వామ్మో.. ఇదేం టాలెంట్ రా బాబు.. ఊ అంటావా పాటను ఇలా చేశారేంటీ..

Covid 19 Third wave: అప్పటి వరకు థర్డ్‌వేవ్‌ తగ్గుముఖం.. కరోనా కేసులపై కీలక వ్యాఖ్యలు చేసిన ఐసీఎంఆర్‌

MLA Balakrishna: హిందూపురం జిల్లా కేంద్రంపై కొనసాగుతోన్న ఆందోళన.. నేడు కలెక్టర్‌ను కలవనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ..