MLA Balakrishna: హిందూపురం జిల్లా కేంద్రంపై కొనసాగుతోన్న ఆందోళన.. నేడు కలెక్టర్‌ను కలవనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ..
హిందూపురం (Hindupuram) జిల్లా కేంద్రం వివాదం అనంతపురం జిల్లా కేంద్రానికి చేరింది. నిన్న మౌనదీక్ష(Mouna Deeksha), భారీ ర్యాలీతో కదం తొక్కిన ఎమ్మెల్యే బాలకృష్ణ(MLA Balakrishna) నేడు అఖిలపక్ష నాయకులతో కలసి కలెక్టర్ ను కలవనున్నారు.
హిందూపురం (Hindupuram) జిల్లా కేంద్రం వివాదం అనంతపురం జిల్లా కేంద్రానికి చేరింది. నిన్న మౌనదీక్ష(Mouna Deeksha), భారీ ర్యాలీతో కదం తొక్కిన ఎమ్మెల్యే బాలకృష్ణ(MLA Balakrishna) నేడు అఖిలపక్ష నాయకులతో కలసి కలెక్టర్ ను కలవనున్నారు. కాసేపటి క్రితమే బాలయ్య భారీ కాన్వాయితో హిందూపురంలోని తన నివాసం నుంచి బయలుదేరారు. ఆయన వెంట అఖిలపక్ష నాయకులతో పాటు స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో కలసి వంద వాహనాల్లో కలెక్టరేట్ కు వస్తున్నారు. ఇటు చిలమత్తూరు, లేపాక్షి మండలాల నుంచి కూడా టీడీపీ నాయకులు కలెక్టరేట్ కు బయలుదేదారు. మరోవైపు జిల్లా కలెక్టర్ తో ఉదయం 11.30గంటలకు కలెక్టర్‌తో బాలకృష్ణ అపాయింట్మెంట్ కూడా ఖరారైంది. ఈమేరకు హిందూపురంని జిల్లా కేంద్రం చేయాలని బాలకృష్ణతో పాటు అఖిలపక్ష నాయకులు కలెక్టర్‌కు వినతి పత్రం అందించనున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ప్రకటన అనంతరం రాజకీయ వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల నేతలు, ప్రముఖులు కూడా తమ ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలోని హిందూపురాన్ని కూడా జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్ బాగా వినిపిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలి నుంచి అంబేడ్కర్ కూడలి వరకు టీడీపీ శ్రేణులు, జిల్లా మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేడ్కర్ కూడలిలో బాలకృష్ణ మౌన దీక్షకు కూర్చున్నారు.
AUS vs PAK: కొత్త కోచ్‌తో పాక్ పర్యటనకు ఆస్ట్రేలియా టీం.. జస్టిస్ లాంగర్ వారసుడు ఎవరంటే?