Minister Botsa satyanarayana: ఆ అంశంపై ఎలాంటి చర్చలు ఉండవు.. ఉద్యోగులతో చర్చలపై మంత్రి బొత్స వ్యాఖ్యలు

పీఆర్సీ సాధన సమితి నాయకులకు, మంత్రుల కమిటీకి మధ్య శుక్రవారం అర్ధరాత్రి దాటి ఒంటి గంట వరకు జరిగిన చర్చలపై ఆంధ్ర ప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అర్ధరాత్రి వరకూ ఉద్యోగ సంఘాలతో చర్చించి వారికి ఉన్న అసంతృప్తులు, అపోహలు తొలగించామన్నారు.

Minister Botsa satyanarayana: ఆ అంశంపై ఎలాంటి చర్చలు ఉండవు.. ఉద్యోగులతో చర్చలపై మంత్రి బొత్స వ్యాఖ్యలు
botsa on three capitals
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 05, 2022 | 12:58 PM

పీఆర్సీ సాధన సమితి నాయకులకు, మంత్రుల కమిటీకి మధ్య శుక్రవారం అర్ధరాత్రి దాటి ఒంటి గంట వరకు జరిగిన చర్చలపై ఆంధ్ర ప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అర్ధరాత్రి వరకూ ఉద్యోగ సంఘాలతో చర్చించి వారికి ఉన్న అసంతృప్తులు, అపోహలు తొలగించామన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఎదురయ్యే ఆర్థిక పరమైన అంశాలను విశ్లేషించి నేటి మధ్యాహ్నం ఉద్యోగులతో చర్చిస్తామని వెల్లడించారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. పిట్ మెంట్ అనేది ముగిసిపోయిన అంశమన్న మంత్రి… దీనిలో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టం చేశారు. హెచ్ ఆర్ ఏ, రికవరీ అంశాలపైనే ఇంకా చర్చించాల్సి ఉందని చెప్పారు. వీటిలో కొన్ని అంశాలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళతామని పేర్కొన్నారు. రికవరీ లేకపోతే ఆర్థిక భారం 5 నుంచి 6 వేల కోట్లు అవుతుందని అన్నారు. హెచ్ ఆర్ ఏ విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉండగా… ఐఆర్, రికవరీ అంశాలపైనే ప్రధానంగా చర్చ జరగాయని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.

పీఆర్‌సీ సాధన సమితి నాయకులకు, మంత్రుల కమిటీకి మధ్య శుక్రవారం అర్ధరాత్రి దాటి ఒంటి గంట వరకు చర్చలు కొనసాగాయి. ఐఆర్‌ రికవరీ చేయబోమని, పీఆర్‌సీని ఐదేళ్లకు ఒకసారి వేస్తామని మంత్రుల కమిటీ నుంచి స్పష్టమైన హామీ లభించింది. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, సీసీఏ కొనసాగింపు, ఫిట్‌మెంట్‌ పెంచడం, సీపీఎస్‌ రద్దు వంటి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగినా మంత్రుల కమిటీ నుంచి స్పష్టమైన హామీ ఏదీ లభించలేదు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లపై ఉద్యోగుల డిమాండ్‌లు, వాటిని నెరవేరిస్తే ప్రభుత్వంపై పడే భారం వంటి అంశాలపై శనివారం 10 గంటలకు మంత్రుల కమిటీ, ఆర్థికశాఖ అధికారులు భేటీ కానున్నారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, శనివారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం అనంతరం తెలిపారు. మరోవైపు అనేక అంశాలపై ఇంకా స్పష్టత రానందున, చర్చలు ఇంకా కొనసాగుతున్నందున శనివారం తాము ముందే ప్రకటించినట్టుగా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.

పీఆర్సీ సాధన సమితి నాయకులు శుక్రవారం సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ముందే నిర్ణయించుకున్నట్టుగా పోరాటం ఉద్ధృతం చేయాలని, శనివారం నుంచి పెన్‌డౌన్‌, యాప్‌డౌన్‌ చేయాలని, ఆరోతేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. శనివారం సెలవు కావడంతో… రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు శుక్రవారమే పెన్‌డౌన్‌ చేసి, కంప్యూటర్లు కట్టేశారు. దీంతో.. వారితో మరోసారి చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇవీచదవండి.

Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే.. మర్చిపోయి కూడా ఈ ఆహార పదార్థాలను తినకండి

ECL Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్! ఇంటర్ అర్హతతో.. కోల్ ఇండియా లిమిటెడ్‌లో 313 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సీన్.. ప్రత్యక్షంగా కలుసుకోనున్న సీఎం కేసీఆర్, బండి సంజయ్..