Andhra Pradesh: కొత్త జిల్లాల ప్రతిపాదనలపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం.. మంత్రి బాలినేని విమర్శలు..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొత్త జిల్లాల(AP New Districts) ప్రకటనపై రగడ కొనసాగుతూనే ఉంది. జిల్లాల పునర్విభజనను కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

Andhra Pradesh: కొత్త జిల్లాల ప్రతిపాదనలపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం.. మంత్రి బాలినేని విమర్శలు..
Balineni Srinivasa Reddy
Follow us
Basha Shek

|

Updated on: Feb 05, 2022 | 1:33 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొత్త జిల్లాల(AP New Districts) ప్రకటనపై రగడ కొనసాగుతూనే ఉంది. జిల్లాల పునర్విభజనను కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో జిల్లాల పేర్ల విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతుంటే.. మరికొన్ని చోట్ల తమ ప్రాంతాలను కూడా జిల్లా కేంద్రాలుగా మార్చాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలో ఈ ఆందోళనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష నేతలు కూడా ఆందోళనకారులకు మద్దతుగా నిలుస్తున్నారు. వీటిపై విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి (Balineni Srinivasa Reddy) స్పందించారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఇందులో ఎలాంటి రాజకీయ అంశాలకు తావు లేదని సమర్థించుకున్నారు.

వాళ్ల సంగతి కూడా తేలుస్తాం.. ‘కడపజిల్లాలో రాజంపేట పార్లమెంట్‌ పరిధిలో రాయచోటి కేంద్రంగా జిల్లా కేంద్రంగా ప్రతిపాదించాం. అదేవిధంగా హిందూపురం పరిధిలో పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి పేరుతో జిల్లా పెట్టాలని ప్రతిపాదించాం. విదేశాల్లో సైతం సత్యసాయికి భక్తులు ఉన్నారు. ఈనేపథ్యంలోనేభక్తులకు అనుకూలంగా ఉంటుందని సత్యసాయి జిల్లాను ఏర్పాటుచేయాలనుకుంటున్నాం. ఇక కృష్ణాజిల్లాకు ఎన్‌టీఆర్‌ పేరు పెట్టాం..అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాగూ ఈ ప్రయత్నం చేయలేకపోయారు. ఎన్‌టీఆర్‌ కూతురు దగ్గుబాటి పురందేశ్వరి జిల్లాకు తన తండ్రి పేరు పెట్టాలని, భారతరత్న ఇవ్వాలని లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా ఎన్నో ఏళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు కనీసం లేఖ కూడా రాయలేకపోయారు. ఒంగోలుకు చెందిన గుప్తా తనకు న్యాయం చేయాలని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర ఫ్లెక్సీ ప్రదర్శించారని తెలిసింది. అమిత్‌షాతో పాటు అమెరికా అధ్యక్షుడికి కూడా ఫిర్యాదు చేసుకోమనండి… గుప్తా వెనుక ఎవరు ఉన్నారో తెలుసు. వాళ్ల సంగతి సంగతి కూడా తేలుస్తాం. ఇక తుని ఘటనపై కేసులు ఎత్తివేయడంపై కాపు సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు’ అని మంత్రి పేర్కొన్నారు.

Also Read:SSC Results: ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాల తేదీలు విడుదల.. సీజీఎస్‌ఎల్, సీజీఎల్ రిజల్ట్స్ ఎప్పుడంటే!

Beauty Care Tips: నూనె రాసుకున్న తర్వాత జుట్టు రాలుతోందా? అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే..

Nandamuri Balakrishna: సీఎం జగన్‌ను కలుస్తా.. మరోసారి ఎమ్మెల్యే బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు