SSC Results: ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాల తేదీలు విడుదల.. సీజీఎస్‌ఎల్, సీజీఎల్ రిజల్ట్స్ ఎప్పుడంటే!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించిన వివిధ పరీక్షలకు సంబంధించిన ఫలితాల ప్రకటన తేదీల (SSC Result dates)ను అధికారిక వెబ్‌సైట్‌లో తాజాగా విడుదల చేసింది...
SSC Result Calendar 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించిన వివిధ పరీక్షలకు సంబంధించిన ఫలితాల ప్రకటన తేదీల (SSC Result dates)ను అధికారిక వెబ్‌సైట్‌లో తాజాగా విడుదల చేసింది. కమీషన్ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం ఈ కింద తెలిపిన తేదీల్లో ఫలితాలు విడుదలవ్వనున్నాయి. ఏ యే తేదీల్లో ఫలితాలు విడుదలవుతాయో ఆ వివరాలు తెలుసుకోండిలా..
- కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) స్థాయి (CHSL) పరీక్ష 2019 (స్కిల్ టెస్ట్), మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామినేషన్ 2020 (పేపర్-I), జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్, కాంట్రాక్ట్‌లు) పరీక్ష 2020 (పేపర్-II) ఫలితాలు ఫిబ్రవరి 28, 2022న వెలువడనున్నాయి.
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ, డీ పరీక్ష 2019 (స్కిల్ టెస్ట్) ఫలితాలు మార్చి 10, 2022న విడుదలవుతాయి.
- సీఏపీఎఫ్ కానిస్టేబుల్ (జీడీ), ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లోని రైఫిల్‌మాన్ (జీడీ) పరీక్ష 2021 ఫలితాలు ఏప్రిల్ 15, 2022న విడుదలవుతాయి.
- కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) పరీక్ష 2020 (టైర్-II) ఫలితాలు ఏప్రిల్ 30, 2022న విడుదలవుతాయి.
ఆయా పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/లో ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు.
Also Read: