- Telugu News Health Uric Acid: Do not eat these 5 things if your uric acid is increased health tips in Telugu
Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే.. మర్చిపోయి కూడా ఈ ఆహార పదార్థాలను తినకండి
Uric Acid Telugu: యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల ఆర్థరైటిస్, వాపు వంటి సమస్యలు వస్తాయి. దీని వల్ల కీళ్ల నొప్పులతోపాటు వాపు కూడా వస్తుంది. మూత్ర పిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు ఈ సమస్య పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు పెద్ద మొత్తంలో ప్యూరిన్ ఉండే ఆహార పదర్ధాలను తినడం మానుకోవాలి. అలాంటి సమయంలో ఆ ఆహార పదార్థాలు ఎంటో ఇప్పుడు తెలుసుకోండి..
Updated on: Feb 05, 2022 | 12:56 PM

క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పుట్టగొడుగులు, చికెన్, సీఫుడ్ మొదలైన వాటిలో ప్యూరిన్లు కనిపిస్తాయి. యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే వీటిని తినకూడదు. ఇది మీ సమస్యను మరింత పెంచే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎండుద్రాక్ష (కిస్‌మిస్) సాధారణంగా ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మీ శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే.. మీరు ఎండుద్రాక్షను అస్సలు తినకూడదు. ఎందుకంటే 100 గ్రాముల ఎండుద్రాక్షలో 105 mg ప్యూరిన్ ఉంటుంది.

పాలకూర, పచ్చి బఠానీల్లో కూడా ప్యూరిన్ సమృద్ధిగా ఉంటుంది. బచ్చలికూరలో అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. అయితే యూరిక్ యాసిడ్ ఉన్నవారు దీనిని తినకపోవడం మంచిది. ఇది మీ శరీరంలో నొప్పి, వాపును పెంచుతుంది. అలాంటి వారు దీన్ని తినడం మానుకోవాలి.

సాధారణంగా చలికాలంలో ప్రజలు వేరుశెనగలు తినడానికి ఇష్టపడతారు. ఇది శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. అలాగే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ 100 గ్రాముల వేరుశెనగలో దాదాపు 75 mg ప్యూరిన్స్ ఉంటాయి. అటువంటి పరిస్థితిలో అర్థరైటిస్, గౌట్ రోగులలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. వారు వేరుశెనగలను ఎక్కువగా తినకపోవడం మంచిది.

మద్యం తాగడం ఏ విధంగానూ మంచిది కాదు. మీ శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే.. మద్యం విషంలా మారుతుంది. వైన్‌లో ప్యూరిన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మద్యం తాగడాన్ని పూర్తిగా మానుకోవడం మంచిది.




