తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సీన్.. ప్రత్యక్షంగా కలుసుకోనున్న సీఎం కేసీఆర్, బండి సంజయ్..
216 అడుగుల సమతాముర్తి విగ్రహాన్ని జాతికి అంకితం ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ వస్తున్నారు. 2 గంటల 10 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి...
216 అడుగుల సమతాముర్తి విగ్రహాన్ని జాతికి అంకితం ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ వస్తున్నారు. 2 గంటల 10 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న మోదీకి స్వాగతం చెప్పెందుకు ఫైనల్ లిస్ట్‌ను ఎస్పీజీ అధికారులకు అందించారు పోలిసులు.. 20 మంది ప్రముఖలు మోదీకి స్వాగతం చెప్పబోతున్నారు.
అయితే నిన్న రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పంపించాలని నిర్ణయించిన్నప్పటికి ముఖ్యమంత్రి కేసిఆర్ మనసు మార్చుకున్నారు.. అయనే స్వయంగా మోదీకి స్వాగతం పలికేందుకు వెళ్తున్నారు. అయితే గత కొంత కాలంగా అయన మోదీ, బండిలపై ఫైర్ అవుతునే ఉన్నారు.. మోదీకి స్వాగతం చెబుతున్న 20 మందిలో బండి సంజయ్ కూడా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కేసిఆర్-బండి ఎదురైన సందర్భం లేదు.. మొదటిసారి ఇరువులు ప్రత్యక్షంగా కలుసుకొనున్నారు. దీనితో రాజకీయ వర్గాల్లో అసక్తి నెలకొంది.
మోదీకి స్వాగతం చెబుతున్న వారిలో గవర్నర్ తమిళసై, కేసీఆర్, కిషన్ రెడ్డి, తలసాని, బండి, రాజాసింగ్, మురళిధర్ రావు, తరుణ్ ఛుగ్, నాడ్లెండ భాస్కర్ రావు.. ఇతర నాయకులు, పోలిసులు అధికారులు, రాష్ట్ర అధికారులు ఉన్నారు.