AP Jobs 2022: ఇంటర్ అర్హతతో రూ. లక్షకుపైగా జీతంతో ఉద్యోగాలు.. కర్నూలులో ప్రారంభమైన ఇంటర్వ్యూలు.. ఇక 4 రోజులే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు (kurnool)లోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...
DMHO Kurnool Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు (kurnool)లోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 18
పోస్టులు: స్పెషల్ ఎంవో (పీడియాట్రిషన్, అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ), మెడికల్ ఆఫీసర్, ఎపిడెమాలజిస్ట్, ఓటీ టెక్నీషియన్, క్లినికల్ సైకాలజిస్ట్, అప్థోమెట్రిస్ట్, డెంటల్ టెక్నీషియన్
పే స్కేల్: నెలకు రూ.12,000ల నుంచి రూ.1,40,000వరకు చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, ఓటీ టెక్నాలజీ కోర్సు, డెంటల్ టెక్నీషియన్ కోర్సు, బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్ డిగ్రీ, ఎంఏ, పీజీ డిప్లొమా, ఎంబీబీఎస్, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు జూలై 1, 2022 నాటికి 42 ఏళ్లు మించరాదు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, విద్యార్హత, సాంకేతిక పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 2, 2022వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.
అడ్రస్: The District Medical and Health Officer, Kurnool, Andhra Pradesh.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను https://kurnool.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు రూ.500లు ఇతర అభ్యర్ధులకు రూ.300లు
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 9, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: