IND vs WI: అహ్మదాబాద్‌ వన్డేతో అరుదైన రికార్డు అందుకోనున్న టీమిండియా.. మరో మైలురాయికి చేరువలో కింగ్‌ కోహ్లీ..

క్రికెట్‌ అంటే పడి చచ్చే ఫ్యాన్స్‌కి మరో గుడ్‌ న్యూస్‌. త్వరలోనే టీమిండియా (Indian Cricket Team) కొత్త రికార్డును నెలకొల్పబోతోంది. దానికి ఈ నెల 6 నుంచి టీమిండియా- వెస్టిండీస్ ((India vs West Indies)  జట్ల మధ్య జరిగే మూడు వన్డేల సిరీస్‌ వేదిక కానుంది.

IND vs WI: అహ్మదాబాద్‌ వన్డేతో అరుదైన రికార్డు అందుకోనున్న టీమిండియా.. మరో మైలురాయికి చేరువలో కింగ్‌ కోహ్లీ..
Follow us
Basha Shek

|

Updated on: Feb 05, 2022 | 10:51 AM

క్రికెట్‌ అంటే పడి చచ్చే ఫ్యాన్స్‌కి మరో గుడ్‌ న్యూస్‌. త్వరలోనే టీమిండియా (Indian Cricket Team) కొత్త రికార్డును నెలకొల్పబోతోంది. దానికి ఈ నెల 6 నుంచి టీమిండియా- వెస్టిండీస్ ((India vs West Indies)  జట్ల మధ్య జరిగే మూడు వన్డేల సిరీస్‌ వేదిక కానుంది. కరోనా ఆంక్షల నేపథ్యంలో సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లను అహ్మదాబాద్‌ (Ahmedabad)లోని నరేంద్రమోదీ స్టేడియంలోనే నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత రెండు జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో 16, 18, 20 తేదీల్లో మూడు టీ20లు జరుగుతాయి. కాగా విండీస్‌తో రేపు జరిగే తొలి వన్డేతో భారత జట్టు అరుదైన ఘనతను అందుకోబోతోంది. ఇది భారత జట్టుకు 1000వ వన్డే మ్యాచ్‌. ఈ మ్యాచ్‌ పూర్తయితే 1000 మ్యాచ్‌లు ఆడిన తొలి దేశంగా భారత్‌ నిలవనుంది. టీమిండియా తర్వాత 958 మ్యాచ్‌లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా.. 936 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉంది. మిగతా జట్లేవీ ఇంకా 900 మ్యాచ్‌లను కూడా పూర్తి చేసుకోకపోవడం గమనార్హం. కాగా ఇప్పటివరకు టీమ్‌ఇండియా 999 వన్డే మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 518 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. 431 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఈ రికార్డ్‌ కూడా ఇటీవల వన్డే కెప్టెన్‌గా నియమితుడైన రోహిత్ శర్మ.. టీమిండియా ఆడనున్న చరిత్రాత్మక 1000వ వన్డేకు సారథ్యం వహించి అరుదైన ఘనతను అందుకోనున్నాడు. వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ మరో రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది. సొంతగడ్డపైనే 5 వేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు కోహ్లీ కేవలం 6 పరుగుల దూరంలో ఉన్నాడు.

భారత్- వెస్టిండీస్‌ సిరీస్‌ షెడ్యూల్‌ ఇలా..

వన్డే సిరీస్‌

*మొదటి వన్డే- ఫిబ్రవరి 6 – అహ్మదాబాద్‌

*రెండో వన్డే- ఫిబ్రవరి 9- అహ్మదాబాద్‌

*మూడో వన్డే- ఫిబ్రవరి 11- అహ్మదాబాద్‌

(మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం1.30 గంటలకు ప్రారంభమవుతాయి)

టీ-20 సిరీస్‌

*మొదటి టీ20 మ్యాచ్‌- ఫిబ్రవరి 16- ఈడెన్‌ గార్డెన్స్‌ (కోల్‌కతా)

*రెండో టీ20 – ఫిబ్రవరి 18- ఈడెన్‌గార్డెన్స్‌

* మూడో టీ20- ఫిబ్రవరి20- ఈడెన్‌ గార్డెన్స్‌

(ఈ మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30లకు ప్రారంభమవుతాయి)

Also Read:Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ ప్రారంభం అప్పుడే .. ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరెవరంటే ?..

Rahul Ramakrishna: కమెడియన్ రాహుల్ రామకృష్ణ సంచలన నిర్ణయం.. ఇకపై సినిమాలు చేయనంటూ..

Statue Of Equality: సమతా తరంగిణి.. తెలంగాణ సిగలో సమతామూర్తి నిలువెత్తు విగ్రహం.. పలు ఆసక్తికర విషయాలు..