AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. ఇదేం టాలెంట్ రా బాబు.. ఊ అంటావా పాటను ఇలా చేశారేంటీ..

ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం పుష్ప (Pushpa) హావా కొనసాగుతుంది. అల్లు అర్జున్ (Allu Arjun).. డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబోలో వచ్చిన

Viral Video: వామ్మో.. ఇదేం టాలెంట్ రా బాబు.. ఊ అంటావా పాటను ఇలా చేశారేంటీ..
Pushpa
Rajitha Chanti
|

Updated on: Feb 05, 2022 | 12:02 PM

Share

ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం పుష్ప (Pushpa) హావా కొనసాగుతుంది. అల్లు అర్జున్ (Allu Arjun).. డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబోలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పాన్ ఇండియా లెవల్లో పుష్ప సినిమా సంచలన విజయం సాధించింది. ఊర మాస్ లుక్‏లో పుష్ప రాజ్ పాత్రలో బన్నీ అదరగొట్టాడు. ఇందులో పుష్ప మేనరిజంకు ప్రేక్షకులే కాదు.. సెలబ్రెటీలు కూడా ఫిదా అయ్యారు. ఇక మరోవైపు ఖండంతరాలను దాటి పుష్ప క్రేజ్ సాగుతుంది. ఆయా దేశాల్లోని ప్రజలు పుష్ప పాటలకు స్టెప్పులేస్తూ.. పుష్ప రాజ్ మేనరిజాంకు ఫిదా అయ్యారు. అయితే పుష్ప సినిమాతోపాటు.. అందులో పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇందులోని ప్రతి పాట యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమాలో సమంత నటించిన స్పెషల్ సాంగ్ నెట్టంట్లో ట్రెండ్ అవుతుంది. ఈ పాటకు తమదైన స్టైల్లో స్టెప్పులేసి అదరగొడుతున్నారు. తాజాగా ఊ అంటావా మావ.. ఊహు అంటావ అంటూ సాగే ఈ పాటకు భలే ఫన్నీగా ఎడిట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అనుపమ్ ఖేర్ అనే యూజర్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలో దివంగత బాలీవుడ్ నటి రీమా లాగూ ఈ పాటను పాడినట్లుగా ఎడిట్ చేశారు. సల్మాన్ ఖాన్ సినిమాలోని రీమా లాగుకు సంబంధించిన క్లిప్ కు ఊ అంటావా మావ.. ఊహు అంటావా పాటను సెట్ చేసి పోస్ట్ చేశారు. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.. మీరు ఈవీడియోను చూసేయ్యండి..

Also Read:  Samantha: పెద్దయ్యాక సమంత అవుతానంటున్న చిన్నారి.. వీడియో షేర్ చేసిన కీర్తి సురేష్..

Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ ప్రారంభం అప్పుడే .. ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరెవరంటే ?..

Rahul Ramakrishna: కమెడియన్ రాహుల్ రామకృష్ణ సంచలన నిర్ణయం.. ఇకపై సినిమాలు చేయనంటూ..

Singer Sunitha: తన భర్త గురించి నెగిటివ్ కామెంట్స్ చేసిన నెటిజన్‏కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన సింగర్ సునీత..