PM Modi: రామానుజాచార్యుల సమతాసూత్రం.. మన రాజ్యాంగానికి స్ఫూర్తి.. ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ విగ్రహావిష్కరణలో ప్రధాని మోడీ

రామానుజాచార్యుల విగ్రహం జ్జానం, ధ్యానానికి ప్రతీక అని ప్రధాని నరేంద్రమోడీ కొనియాడారు. రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయమన్నారు. రామానుజాచార్యుల విగ్రహం ఆయన ఆదర్శాలకు ప్రతీక అని, దేశ సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు.

PM Modi: రామానుజాచార్యుల సమతాసూత్రం.. మన రాజ్యాంగానికి స్ఫూర్తి.. 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' విగ్రహావిష్కరణలో ప్రధాని మోడీ
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 05, 2022 | 8:31 PM

PM Narendra Modi Unveils Sri Ramanujacharya Statue of Equality: రామానుజాచార్యుల విగ్రహం జ్జానం, ధ్యానానికి ప్రతీక అని ప్రధాని నరేంద్రమోడీ(Narendra Modi) కొనియాడారు.  రామానుజాచార్యుల(Sri Ramanujacharya ) బోధనలు అనుసరణీయమన్నారు. రామానుజాచార్యుల విగ్రహం(Statue of Equality) ఆయన ఆదర్శాలకు ప్రతీక అని, దేశ సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు.సమాజంలోని అందరికీ సమాన అవకాశాలు దక్కాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. అందరూ సమానంగా అభివృద్ధి చెందాలంటే ఐక్యమత్యంతో సాగాలన్నారు. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఉజ్వల్‌ పథకం, జన్‌ధన్‌, స్వచ్ఛ్‌ భారత్‌ వంటి పథకాలన్నీ అందులో భాగమేనని తెలిపారు

రామానుజాచార్య విశిష్టాద్వైత కర్త అని కొనియాడారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన బోధనల్లో ఒకవైపు జ్ఞాన సముపార్జనకు మార్గాలున్నాయనీ.. మరోవైపు భక్తి మార్గాన్ని ఎలా అనుసరించాలో తెలిపారనీ చెప్పారు. సన్యాసాన్ని స్వీకరించి సిద్ధి పొందడానికి ఒక పరంపరను సృష్టించిన మహానుభావుడు రామానుజాచార్యుడు అని ప్రధాని అన్నారు. సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం మహాత్భాగ్యంగా భావిస్తున్నట్టు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మూర్తి.. భావితరాలకు ప్రేరణ మాత్రమే కాదన్నారు. భాతీయ ప్రాచీన మూలాలను బలపర్చేందుకు కూడా దోహదం చేస్తుందనే పూర్తి విశ్వాసం తనకుందన్నారు.

. దేశ ఏకతకు రామానుజాచార్యులు స్ఫూర్తి. దేశమంతటా వ్యాప్తి చెందిందన్నారు. స్వాతంత్ర్య పోరాటం కేవలం దేశ ప్రజల అధికారం కోసమే కాదు. తెలుగు సంస్కృతి దేశ భిన్నత్వాన్ని బలోపేతం చేస్తోంది. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు తెలుగు సంస్కృతిని పోషించారు. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. పోచంపల్లికి ప్రంచ వారసత్వ గ్రామంగా ఘనత దక్కింది. తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైందని పేర్కొన్నారు.

‘మనిషి జీవితంలో గురువు అత్యంత కీలకమన్న ప్రధాని.. గురువే ధ్యాన కేంద్రమన్నారు. 108 దివ్య దేశ మందిరాలను ఇక్కడ చూశాను. దేశమంతా తిరిగి దేవాలయాలను చూసిన అనుభూతి కలిగిందన్నారు. సమాజంలో అంతరాలను రామానుజాచార్య వెయ్యేళ్ల క్రితమే తొలగించారన్నారు. అందరినీ సమానంగా చూశారని, అనాడే ఆయన ఆదర్శాలు దేశవ్యాప్తంగా విస్తరించాయన్నారు. రామానుజాచార్యులు దళితులను ఆలయ ప్రవేశం చేయించారు. మనిషికి జాతి కాదు.. గుణం ముఖ్యమని లోకానికి చాటారు. రామానుజాచార్యుల సమతాసూత్రం.. మన రాజ్యాంగానికి స్ఫూర్తి.’ అని పేర్కొన్నారు.