AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Millets Benfits: సిరి ధాన్యాలతో అద్భుత ప్రయోజనాలు.. ఈ వ్యాధులకి దివ్య ఔషధం..

Millets Benfits: భారతదేశంలో సిరి ధాన్యాలు అత్యంత ప్రజాధారణ పొందినవి. వీటివల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఎన్నో వ్యాధులకి దివ్య ఔషధంలా

Millets Benfits: సిరి ధాన్యాలతో అద్భుత ప్రయోజనాలు.. ఈ వ్యాధులకి దివ్య ఔషధం..
Millets
uppula Raju
|

Updated on: Feb 05, 2022 | 10:26 PM

Share

Millets Benfits: భారతదేశంలో సిరి ధాన్యాలు అత్యంత ప్రజాధారణ పొందినవి. వీటివల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఎన్నో వ్యాధులకి దివ్య ఔషధంలా చెప్పవచ్చు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సంప్రదాయక ఆహారాలు అంటే సిరిధాన్యాలు లేదా వీటినే తృణధాన్యాలు ఇంగ్లీష్ లో మిల్లెట్స్ అని పిలుస్తారు. భారతదేశంలో ప్రధానంగా జొన్నలు, సజ్జలు, రాగులు, బజ్రా, బుక్వీట్, తదితర ధాన్యాలు వస్తాయి. మిల్లెట్లు ఆరోగ్యకరమైన ధాన్యం అయినప్పటికీ గోయిట్రోజెనిక్ పాలీఫెనాల్స్, ఫైటిక్ యాసిడ్ వంటి యాంటీ-న్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యంపై అనారోగ్యకరమైన ప్రభావాన్ని చూపుతుంది ఇతర పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. అందువల్ల ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే వాటి గురించి వివరంగా తెలుసుకోవాలి.

వీటిని ఆహారంగా తీసుకుంటే రక్తంలో గ్లూకోస్ శాతం తగ్గుముఖం పడుతుంది. దీని వల్ల మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాల్షియమ్ వీటిలో చాలా అధికంగా ఉంటుంది. దీని వల్ల దంతాలు, ఎముకలు గట్టిగా ఉంటాయి. సిరిధాన్యాలు పీచుని అధికంగా కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని తింటే కిడ్నీలో, పిత్తాశయంలో రాళ్ళు రావటం వంటి సమస్యలు తగ్గుతాయి. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కొవ్వు తగ్గుతుంది. ఇప్పటికే అసిడిటీ ఉన్నవారు వీటిని తినటం వల్ల చాలా మేలు జరుగుతుంది.

వీటిలో ఎలర్జీ కలిగించే గుణం ఉండదు కనుక చిన్న పిల్లలకు కూడా తినవచ్చు. ఊబకాయం, కాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు వీటిని రోజు తింటే మంచిది. తక్కువ తినగానే పొట్ట నిండుగా అనిపించటం వల్ల ఊబకాయం కూడా తగ్గుతుంది. కాన్సర్ వ్యాధి బారిన పడకుండా మనల్ని కాపాడుతాయి. రక్త పోటు ఉన్నవారు వీటిని తీసుకోవటం వల్ల అది అదుపులో ఉంటుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.

Viral Video: మెట్రో స్టేషన్‌లో మొబైల్‌ చూస్తూ ట్రాక్‌పై పడిపోయిన ప్రయాణికుడు.. ప్రాణాలను కాపాడిన CISF జవాన్

వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రైవేట్‌ కాలేజీల ఫీజులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు..

Online Medicine: ఆన్‌లైన్‌లో మందులు కొనుగోలు చేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..?