Viral Video: మెట్రో స్టేషన్‌లో మొబైల్ చూస్తూ ట్రాక్‌పై పడిపోయిన ప్రయాణికుడు.. ప్రాణాలను కాపాడిన CISF జవాన్
Viral Video: రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. దీంతో ఈ ప్రమాదాలను సీరియస్‌గా తీసుకొని స్టేషన్‌లలో
Viral Video: రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. దీంతో ఈ ప్రమాదాలను సీరియస్‌గా తీసుకొని స్టేషన్‌లలో సెక్యూరిటీ పెంచుతున్నారు. శనివారం షహదారా మెట్రో స్టేషన్‌లో ఇలాంటి కేసు ఒకటి కనిపించింది. సీఐఎస్ఎఫ్ జవాన్ అవగాహన వల్ల ఘోర ప్రమాదం తప్పింది. ఈ ఘటన మొత్తం స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెట్రో స్టేషన్‌లలో ప్రయాణికులు మొబైల్ చూస్తూ గడపడంలో బిజీగా ఉంటారు.
దీని ఫలితంగా ఒక్కోసారి స్తంభాలను ఢీకొనడం, ఒక్కోసారి గుంతలో పడిపోవడం, కొన్నిసార్లు రైల్వే ట్రాక్‌పై పడిపోవడం కూడా జరుగుతాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా అలాంటిదే. మొబైల్ చూస్తూ వెళుతున్న ఓ వ్యక్తి మెట్రో ట్రాక్‌పై పడిపోతాడు. ఈ సమయంలో CISF జవాన్ పెట్రోలింగ్ చేస్తున్నాడు. కొన్ని సెకన్లు ఆలస్యమైతే ఏదో ఒక మెట్రో ఢీకొని ప్రయాణికుడి ప్రాణాలు పోయేవి. కానీ జవాన్ ట్రాక్‌లోకి దూకి కిందపడిన వ్యక్తిని పైకి లేపాడు. అక్కడి నుంచి ప్లాట్ ఫాం ఎక్కించి ప్రాణాలు కాపాడాడు.
ఈ ఘటన శుక్రవారం రాత్రి 8.43 గంటల ప్రాంతంలో జరిగింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారడంతో ప్రజలు తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. వినియోగదారులు CISF జవాన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అదే సమయంలో మెట్రో స్టేషన్‌లో ఫోన్‌లను ఉపయోగించే వారికి ఈ సంఘటన ఒక గుణపాఠంగా పేర్కొన్నారు. మరో వినియోగదారు ‘గొప్ప పని సార్’ అని మెచ్చుకున్నాడు. చాలా మంది ఈ వీడియో చూసి నేర్చుకోవాలన్నారు.
A passenger namely Mr. Shailender Mehata, R/O Shadhara, slipped and fell down on the metro track @ Shahdara Metro Station, Delhi. Alert CISF personnel promptly acted and helped him out. #PROTECTIONandSECURITY #SavingLives@PMOIndia @HMOIndia @MoHUA_India pic.twitter.com/Rx2fkwe3Lh
— CISF (@CISFHQrs) February 5, 2022