Online Medicine: ఆన్‌లైన్‌లో మందులు కొనుగోలు చేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..?
Online Medicine: ఆన్‌లైన్ కార్యకలాపాలు పెరగడంతో ప్రతి ఒక్కరి జీవితం చాలా సులభమైంది. వస్తువుల కోసం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లనవసరం లేదు.
Online Medicine: ఆన్‌లైన్ కార్యకలాపాలు పెరగడంతో ప్రతి ఒక్కరి జీవితం చాలా సులభమైంది. వస్తువుల కోసం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లనవసరం లేదు. ఒకే ఒక క్లిక్‌తో ఆర్డర్ చేయవచ్చు. ఈ సౌలభ్యంతో పాటు జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యం. లేదంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోవడం ఖాయం. ఇప్పుడు ఆన్‌లైన్‌లో మందులను సులభంగా ఆర్డర్ చేయవచ్చు. అనేక రకాల తగ్గింపులు కూడా ఇస్తున్నారు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పోర్టల్ సైబర్ దోస్త్ ఆన్‌లైన్ మోసాల గురించి నిరంతరం ప్రజలని హెచ్చరిస్తుంది.
1. ముందస్తు చెల్లింపు చేసే ముందు జాగ్రత్త
విశ్వసనీయమైన ఫార్మసీ నుంచి మందులు ఆర్డర్ చేయడం మంచిది. ఎటువంటి విచారణ లేకుండా ఆన్‌లైన్ సైట్ నుంచి మందులను ఆర్డర్ చేయడం మంచిదికాదు. అంతేకాదు వచ్చిన మందులు కచ్చితమైనవా లేదా అని నిర్ధారించుకోవాలి. ఎందుకంటే కొంతమంది డూప్లికేట్ మందులు కూడా విక్రయిస్తారు. దీనివల్ల చాలా డబ్బులు కోల్పోవాల్సి వస్తుంది.
2. నమ్మకమైన ఫార్మసీ నుంచి మందుల కొనుగోలు
నమ్మకమైన ఫార్మసీ లేదా తెలిసిన మందుల షాపు నుంచి కొనుగోలు చేయడం ఉత్తమం. డిస్కౌంట్ల వ్యవహారంలో ప్రజలు తరచుగా మోసానికి గురవుతారు. అందువల్ల కచ్చితమైన మందుల కోసం కచ్చితమైన ఫార్మసీని ఎంచుకోవాలి.
3. ప్రజల ఆరోగ్యానికి ముప్పు
గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. చాలా సైట్లు విక్రయాలు జరుపుతున్నాయి. ఇందులో కొన్ని గుర్తింపులేని సైట్లు కూడా ఉన్నాయి. రిటైలర్లు మందులపై 20% వరకు తగ్గింపును అందిస్తే ఆన్‌లైన్ కంపెనీలు 60% వరకు తగ్గింపును అందిస్తున్నాయి. కానీ ఆన్‌లైన్‌లో మందులు ఆర్డర్ చేసినప్పుడల్లా కచ్చితంగా వాటిని పరిశీలించడం ముఖ్యం.