Raw Milk: పచ్చిపాలు ముఖానికి పట్టిస్తే అద్భుత ప్రయోజనాలు.. ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం..

Raw Milk: పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో విటమిన్లు, బయోటిన్, లాక్టిక్ యాసిడ్, మెగ్నీషియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.

Raw Milk: పచ్చిపాలు ముఖానికి పట్టిస్తే అద్భుత ప్రయోజనాలు.. ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం..
Milk
Follow us
uppula Raju

|

Updated on: Feb 05, 2022 | 7:54 PM

Raw Milk: పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో విటమిన్లు, బయోటిన్, లాక్టిక్ యాసిడ్, మెగ్నీషియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇంట్లోని పెద్దలు, పిల్లలు ప్రతి ఒక్కరూ పాలు తాగాలని నిపుణులు సూచిస్తారు. అయితే పాలు ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సంరక్షణ కూడా ఉపయోగపడుతాయి. పచ్చిపాలు అనేక చర్మ సమస్యలను దూరం చేస్తుంది. చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. మచ్చలు, గుర్తులను తొలగిస్తుంది. అంతేకాదు పాలని ఉపయోగించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పచ్చి పాల వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

1. డెడ్‌ స్కిన్‌ తొలగిపోతుంది

పెరుగుతున్న కాలుష్యం కారణంగా చర్మం దెబ్బతింటుంది. కొంత కాలం తర్వాత ముఖంపై డెడ్ స్కిన్ పేరుకుపోతుంది. పచ్చి పాలను ముఖానికి అప్లై చేయడం ద్వారా డెడ్ స్కిన్‌ను సులభంగా తొలగించుకోవచ్చు. దీని కోసం మీరు ఓట్స్, పచ్చి పాలతో చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. రెండింటినీ కలిపి స్క్రబ్బింగ్ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం మెరుస్తుంది.

2. మెరుస్తున్న చర్మం

పచ్చి పాల ప్రయోజనం ఏంటంటే ఇది చర్మం లోపలి నుంచి మెరిసేలా చేస్తుంది. ఇందుకోసం పచ్చి పాలని దూదితో తీసుకొని ముఖానికి రాసుకోవాలి. నెమ్మదిగా మసాజ్ చేయాలి. మీ చర్మం జిడ్డుగా ఉంటే టోన్డ్ మిల్క్‌ని ఉపయోగించవచ్చు.

3. యాంటీ ఏజింగ్

పాలలో ఉండే విటమిన్ ఎ, బి యాంటీ ఏజెంట్లుగా పనిచేస్తాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వవు. ముఖాన్ని క్లీన్‌గా ఉంచుతాయి. మచ్చలని తొలగిస్తాయి.

4. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి

మీరు పాలను సహజమైన క్లెన్సర్‌గా ఉపయోగిస్తే అది చాలా కాలం పాటు చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇందులోని విటమిన్లు ఎక్స్‌ఫోలియంట్‌గా పని చేస్తాయి. చర్మంలో తేమ కూడా అలాగే ఉంటుంది.

5 కోట్ల కార్బెవాక్స్ డోసులకి కేంద్రం ఆర్డర్.. ఒక్కో డోస్‌ 145 రూపాయలు.. ముందుగా ఎవరికంటే..?

మన్మోహన్ సింగ్ సంతకంతో ఉన్న 2 రూపాయల నోటు లక్షలు సంపాదిస్తుంది.. ప్రత్యేకత ఏంటంటే..?

IND vs WI: టీమ్‌ ఇండియాలోకి మళ్లీ ‘కుల్చా’ జోడి.. మ్యాజిక్‌ పనిచేసేనా..?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!