Hair Care: జుట్టుకి ఆయిల్ రాసేటప్పుడు ఈ 4 తప్పులు అస్సలు చేయకూడదు.. అవేంటంటే..?
Hair Care: వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ రోజుల్లో జుట్టు రాలడం సర్వసాధారణం. అయితే దీనివల్ల తలలో చుండ్రు వంటి సమస్యలు ఏర్పడుతాయి. అప్పుడు ప్రజలు జుట్టుకి ఆయిల్
Hair Care: వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ రోజుల్లో జుట్టు రాలడం సర్వసాధారణం. అయితే దీనివల్ల తలలో చుండ్రు వంటి సమస్యలు ఏర్పడుతాయి. అప్పుడు ప్రజలు జుట్టుకి ఆయిల్ మసాజ్ చేస్తారు. ఇది జుట్టును బలోపేతం చేయడమే కాకుండా సహజ మెరుపుని కూడా తీసుకొస్తుంది. అయితే ప్రజలు నూనె రాసుకునే సమయంలో చాలా తప్పులు చేస్తుంటారు. దీని కారణంగా జుట్టు రాలడం మళ్లీ ప్రారంభమవుతుంది. నూనె రాసుకున్న తర్వాత కూడా జుట్టు ఎందుకు రాలుతుందో తెలుసుకోవడం ముఖ్యం. మీరు తరచుగా చేసే అలాంటి కొన్ని తప్పుల గురించి తెలుసుకుందాం.
1. వేడి నూనె
తరచుగా జుట్టుకు వేడి నూనె రాసుకోవడం మంచిది కాదు. దీని వల్ల మూలాలు బలహీనమై జుట్టు రాలడం మొదలవుతుంది. ఇలా చేయడం వల్ల తలలో మంట కూడా పుడుతుంది. మీరు సీజన్ ప్రకారం జుట్టుకు చల్లని లేదా వేడి నూనెను అప్లై చేయాలి. జుట్టుకు గోరువెచ్చని నూనె రాసుకోవడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2. బలంగా రుద్దడం
ఆయిల్ మసాజ్ సమయంలో ప్రజలు చేసే ఒక తప్పు ఏంటంటే జుట్టును బలంగా రుద్దుతారు. ఇలా చేయడం వల్ల వెంట్రుకల మూలాలు బలహీనపడి జుట్టు రాలడం మొదలవుతుంది. జుట్టును బలంగా లాగడం మంచిదికాదు. జుట్టుకు నూనె రాసేటప్పుడు తేలికపాటి చేతులతో మసాజ్ చేస్తే సరిపోతుంది.
3. జుట్టు ముడుచుకోవడం
జుట్టుకు నూనె రాసుకున్న తర్వాత జుట్టును గట్టిగా ముడుచుకుంటారు. ఇది చాలా తప్పు. ఇలా చేయడం వల్ల జుట్టు మూలాలు పాడవుతాయి. ఇది జుట్టు మూలాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో జుట్టు బలహీనంగా తయారవుతుంది. నూనె రాసుకున్న వెంటనే దువ్వెన పెట్టడం కూడా సరికాదు.
4. ఎక్కువ సేపు ఉండటం
జుట్టుకు నూనె రాసుకున్న తర్వాత కొంత సమయం తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. కానీ చాలామంది నూనె రాసుకున్న తర్వాత జుట్టును గంటల తరబడి అలాగే వదిలేస్తారు. దీని కారణంగా జుట్టులో జిడ్డు తయారవుతుంది. చుండ్రు ఏర్పడటం ప్రారంభమవుతుంది. జుట్టు రాలడానికి చుండ్రు ప్రధాన కారణమని చెప్పవచ్చు.