Cumin: ముడతలు, మొటిమలకు జీలకర్రతో చెక్.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..?
Cumin: ఆహారపు రుచిని పెంచే జీలకర్ర ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. బరువు తగ్గడానికి ప్రజలు పరగడుపున జీలకర్ర నీరు తాగుతారు.
Cumin: ఆహారపు రుచిని పెంచే జీలకర్ర ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. బరువు తగ్గడానికి ప్రజలు పరగడుపున జీలకర్ర నీరు తాగుతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్స్ ఉండవు. జీలకర్ర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుంది. జీలకర్రలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. విటమిన్ కె, విటమిన్ బి6, విటమిన్ సి, కాల్షియం, ఫైబర్, సోడియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. జీలకర్ర నీటిని తీసుకోవడం ద్వారా చర్మం లోపలి నుంచి మెరిసేలా చేయవచ్చు. అయితే మీరు దాని నీటిని చర్మ సంరక్షణలో టోనర్‌గా ఉపయోగించవచ్చు. జీలకర్రలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మాన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. జీలకర్ర టోనర్‌తో ఈ చర్మ సమస్యలను తొలగించుకోవచ్చు.
1. వృద్ధాప్యం
పెరుగుతున్న కాలుష్యం, చెడు జీవనశైలి కారణంగా చర్మంపై ముడతలు సాధారణ సమస్యగా మారాయి. అకాల ముడతలు కనిపించడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీలకర్ర నీటితో తయారు చేసిన టోనర్‌తో అకాల ముడతలను తగ్గించవచ్చు. టోనర్‌కు బదులుగా జీలకర్ర నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనం చేకూరుతుంది.
2. చర్మ వ్యాధులు
జీలకర్రలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ వ్యాధులను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. వాటి నుంచి బయటపడాలంటే జీలకర్రను రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం ఈ నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేసిన 30 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి. కొన్ని రోజుల్లో మీరు చర్మంపై తేడాను చూడటం ప్రారంభిస్తారు.
3. మొటిమలు
జీలకర్రలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంపై ఏర్పడిన మొటిమలను తొలగిస్తాయి. వాస్తవానికి చర్మంపై పేరుకుపోయే బ్యాక్టీరియా కారణంగా మొటిమలు ఏర్పడుతాయి. వాటికి సకాలంలో చికిత్స చేస్తే తొలగిపోతాయి. జీలకర్ర నీటితో ముఖం కడగడం ఉత్తమం. చర్మంపై పేరుకుపోయే బ్యాక్టీరియాను తొలగించడం ద్వారా మొటిమలు ఏర్పడకుండా నిరోధిస్తుంది.
4. మెరిసే చర్మం
చర్మ సంరక్షణ దినచర్యలో జీలకర్ర నీటిని ఉపయోగించడం ద్వారా ముఖం కోల్పోయిన మెరుపును తిరిగి పొందవచ్చు. ఇందుకోసం జీలకర్ర నీటిలో పసుపు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. జీలకర్ర నీటితో పాటు, పసుపు చర్మ సమస్యను తొలగిస్తుంది. తేనె చాలా కాలం పాటు ముఖంపై తేమను నిలిపేలా చేస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 30 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల కోల్పోయిన మెరుపుని సాధించవచ్చు.