- Telugu News Photo Gallery A pinch of black salt is beneficial in many diseases know the amazing benefits
Black Salt: గోరు వెచ్చని నీటిలో చిటికెడు నల్ల ఉప్పు.. పరగడుపున తాగితే అద్భుత ప్రయోజనాలు..?
Black Salt: నల్ల ఉప్పులో అనేక రకాల ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఉదయం లేవగానే పరగడుపున గోరువెచ్చని నీటిలో చిటికెడు నల్ల ఉప్పు కలిపి తాగితే చాలా మేలు జరుగుతుంది.
Updated on: Feb 04, 2022 | 5:54 PM

ఉదయం లేవగానే కాస్త నల్ల ఉప్పు కలిపి గోరువెచ్చని నీరు తాగితే థైరాయిడ్ వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తం పలచబడి గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

పరగడుపున నల్ల ఉప్పు నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. బాగా ఆకలివేస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఎసిడిటీ, వాంతులు, మలబద్ధకం సమస్యలు ఉండవు.

నల్ల ఉప్పు ఎముకలను బలపరుస్తుంది. కీళ్ల నొప్పులకు ఉపయోగపడుతుంది. శరీరానికి చాలా పోషకాలు లభిస్తాయి.

మీరు అధిక బరువుతో బాధపడుతున్నట్లయితే నల్ల ఉప్పు నీటిని తాగాలి. ఇందులో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

మీకు గొంతునొప్పి, జలుబు లేదా దగ్గు ఉంటే ఉదయాన్నే నల్ల ఉప్పు నీటిని తాగితే మంచి ఉపశమనం దొరుకుతుంది. ఇది మీ ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది.





























