- Telugu News Photo Gallery Technology photos Oppo Launching New Smart Phone In Indian Market Oppo Reno 7 pro Features and Price
Oppo Reno 7 Pro: ఒప్పో నుంచి కొత్త ఫోన్‌లు వచ్చేశాయి.. ఒప్పో 7 సిరీస్ ఫీచర్లు, ధర వివరాలు..
Oppo Reno 7 Pro: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి ఒప్పో 7 సిరీస్‌తో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Feb 04, 2022 | 3:24 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి రెనో 7 సిరీస్‌లో భాగంగా ఒప్పో రెనో 7 ప్రో, ఒప్పో రెనో 7 మోడల్స్‌ను లాంచ్ చేశాయి.

ఒప్పో రెనో 7 8జీబీ ర్యామ్+256 స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ. 28,999 కాగా, 7 ప్రో 12జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 39,999గా ఉంది. ఈ ఫోన్‌ల సేల్ ఫిబ్రవరి 17ను ప్రారంభం కానుంది.

ఒప్పో 7 ప్రో స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా ప్రొటెక్షన్ అదనం.

ఇక ఆండ్రాయిడ్ 12+ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో నడిచే ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 1200 మ్యాక్స్ ప్రాసెసర్‌ను ఇచ్చారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.





























