E-Passport: కేంద్రం తీసుకురానున్న కొత్త ఈ-పాస్‌పోర్ట్‌.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా.?

E-Passport: తాజాగా కేంద్ర ఆర్థిక శాకమంత్రి నిర్మలా సీతరామన్‌ బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఈ-పాస్‌పోర్ట్ గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పాస్‌పోర్ట్‌ల స్థానంలో కొత్త పాస్‌పోర్ట్‌లను తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఈ పాస్‌పోర్ట్‌ ప్రత్యేకతలు ఏంటో తెలుసా...?

Narender Vaitla

|

Updated on: Feb 03, 2022 | 6:58 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సమయంలో పాస్‌పోర్ట్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో త్వరలోనే ఈ-పాస్‌పోర్ట్ ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇంతకీ ఈ-పాస్‌ పోర్ట్ ఏంటి.? వీటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1 / 5
కొత్త రకం పాస్‌పార్ట్‌లలో ఎంబెడెడ్‌ చిప్స్‌ను ఉపయోగించడంతో పాటు ఫ్యూచరిస్టిక్‌ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఇందులో మైక్రోచిప్‌లను ఉపయోగిస్తారు. వీటిని ట్యాంపరింగ్‌, నకిలీవి మార్చడానికి అవకాశం ఉండదు.

2 / 5
ప్రస్తుతం ఇలాంటి ఈ - పాస్‌ పోర్ట్‌లో అమెరికా, యూకే, జర్మనీతో పాటు పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నాయి. ఈ కొత్త పాస్‌పోర్ట్‌లను నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌లో తయారు చేయనున్నారు.

3 / 5
ఇందులో ఉండే మైక్రోచిప్‌లో పాస్‌పోర్ట్‌ కలిగిన వ్యక్తి పుట్టిన తేదీ, పేరుతో పాటు అన్ని వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. దీంతో ఇమిగ్రేషన్‌ కౌంటర్‌ వద్ద సమయం వృథా కాకుండా నిమిషాల్లో స్కాన్‌ చేసే అవకాశం లభిస్తుంది.

4 / 5
పాస్‌పోర్ట్‌లో ఉండే  చిప్‌ను ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉండదు. ఎవరైనా నకిలీ పాస్‌పోర్ట్‌లను తయారు చేయాలనుకుంటే ఇట్టే దొరికిపోతారు.

5 / 5
Follow us