Health Benefits : రేగుపండ్ల వల్ల ఎన్నోలాభాలు.. ముఖ్యంగా ఆ వ్యాధులు దరి చేరనివ్వదట..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనుషులు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలను పాటిస్తున్నారు.
Health Benefits : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనుషులు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలను పాటిస్తున్నారు. చిన్న చిన్న చిట్కాలతో దీర్ఘకాలిక రోగాలను కూడా తరిమేయవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. అలాగే పండ్లు తినడం వల్ల చాలా వరకు రోగాలు దరి చేరవట సీజన్ ను బట్టి ఆయా సీజన్ లో కాసే పండ్లను తినడం వల్ల చాలా వరకు ఆరోగ్యంగా ఉండొచ్చు అని వైద్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా రేగు పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదట. చలికాలంలో ఈ రేగు పండు ఎంతో మేలు చేస్తుందట. వాతావరణంలో మార్పు వల్ల కలిగే ఇంఫెక్షన్స్ ను ఇది అడ్డుకుంటుందట. విటమిన్ సీ ఇందులో ఉంటుంది. అంతే కాదు రేగు పండు చుండ్రును కూడా అరికడుతుందట. జలుబనో, దగ్గనో, జ్వరమనో అంటూ ఉండే వారికి రేగు పండు చాలా ఉపశమనాన్ని ఇస్తుందని అంటున్నారు నిపుణులు.
ఇందులో క్యాలరీలు కూడా చాలా తక్కువ ఉంటాయి. విటమిన్ సీ, ఫైబర్ పుష్కలంగా లభించే ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం వల్ల బీపీ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అలాగే నిద్రలేమి సమస్యలకు కూడా రేగుపండు చాలా ఉపయోగపడుతుందట. ఈ పండులో శాపోనిన్స్, పాలీశాకరైడ్స్ అనే ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. శాపోనిన్స్ చక్కని నిద్రకి దోహదం చేస్తాయని తెలుస్తోంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఫ్రీ ర్యాడికల్స్ తో పోరాడి, ఇమ్యూనిటీని స్ట్రాంగ్ గా చేస్తుంది.ఈ పండ్లలో సోడియం తక్కువగా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు లక్షణాలూ కలిసి బీపీ ని కంట్రోల్‌లో ఉంచుతాయట. రేగు పండులో ఉండే ఐరన్, ఫాస్ఫరస్ బ్లడ్ సర్క్యులేషన్‌ని కూడా రెగ్యులేట్ చేస్తాయి. ఇంకా రేగు పండులో ఉండే ఐరన్, ఫాస్ఫరస్, కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :