Temple Vastu Tips: ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులా.. అయితే పూజ గదిలో ఈ వస్తువులు పెట్టుకోండి..

Temple Vastu Tips: వాస్తు శాస్త్రంలో.. వస్తువుల ప్రాముఖ్యత, ఇంట్లో అవి ఉంచే స్థానం గురించి చెప్పబడింది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు వ్యక్తిపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని..

Temple Vastu Tips: ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులా.. అయితే పూజ గదిలో ఈ వస్తువులు పెట్టుకోండి..
Vastu Tips For Puja Room
Follow us
Surya Kala

|

Updated on: Feb 04, 2022 | 10:48 PM

Temple Vastu Tips: వాస్తు శాస్త్రంలో.. వస్తువుల ప్రాముఖ్యత, ఇంట్లో అవి ఉంచే స్థానం గురించి చెప్పబడింది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు వ్యక్తిపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపే శక్తిని కలిగి ఉంటుంది. వాస్తు దోషం ఉంటే.. పూర్తి అవుతుంది అనుకున్న పని కూడా చెడిపోతుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఇంటిలోని పూజ గదిలో ఏ వస్తువులు ఉంచాలి అనేది కూడా చాలా ముఖ్యమైనది. లక్ష్మి దేవి సంతోషంగా ఉండటానికి.. ఆమె అనుగ్రహం పొందడానికి ఇంటిలోని పూజ గదిలో ఏ వస్తువులు ఉంచాలో ఈరోజు తెలుసుకుందాం..

పూజ గది ఏర్పాటు: వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటిలో ఈశాన్య దిక్కులో పూజ గది ఏర్పాటు చేసుకోవడం శుభప్రదం. ఈ దిశలో ఆలయాన్ని నిర్మిస్తే ఇంట్లో సుఖశాంతులు, శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. అయితే ఇంట్లో పొరపాటున కూడా దక్షిణ దిశలో ఆలయాన్ని నిర్మించకూడదు. ఆలయాన్ని దక్షిణం వైపు ఏర్పాటు చేస్తే.. ధన నష్టం కలిగే అవకాశం ఉందని నమ్ముతారు.

నెమలి ఈక శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం. పూజా స్థలంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు. వాస్తు శాస్త్రంలో పూజ గదిలో నెమలి ఈకలను ఉంచడం ప్రతికూల శక్తిని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆలయంలో ఉంచడం వల్ల భగవంతుని అనుగ్రహం కలుగుతుంది.

శంఖం ఇంట్లో నిత్యం శంఖం ఊదడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పూజా స్థలంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు ఉంటాయి.

గంగాజలం హిందూ మతంలో పవిత్ర గంగా నది నీటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర జలం ఎప్పుడూ చెడిపోదని నమ్మకం. ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజా స్థలంలో ఉంచడానికి కారణం ఇదే. ఇలా చేయడం వల్ల లక్ష్మి దేవి సంతోషిస్తుంది.

శాలిగ్రామం శాలిగ్రామం విష్ణువు రూపంగా పరిగణించబడుతుంది. శాలిగ్రామ స్వామిని పూజా స్థలంలో ఉంచడం చాలా శ్రేయస్కరం. లక్ష్మిదేవి ప్రసన్నం కలుగుతుందని నమ్మకం.

Note: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

తెలంగాణాలో మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు.. ఏపీలో దట్టమైన పొగమంచు..