AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల 15 తర్వాత ఆఫ్‌లైన్ లో సర్వదర్శనం టోకన్లను కేటాయించే అవకాశం..

Tirupati: తిరుమల అన్నమయ్య భవనంలో అధికారులతో టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి(TTD EO Jawahar Reddy) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు.. కరోనా వైరస్(Corona Virus) కేసులు..

Tirupati: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల 15 తర్వాత ఆఫ్‌లైన్ లో సర్వదర్శనం టోకన్లను కేటాయించే అవకాశం..
Tirumala Tirupati
Surya Kala
|

Updated on: Feb 04, 2022 | 4:27 PM

Share

Tirupati: తిరుమల అన్నమయ్య భవనంలో అధికారులతో టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి(TTD EO Jawahar Reddy) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు.. కరోనా వైరస్(Corona Virus) కేసులు తగ్గితే.. ఫిబ్రవరి 15 తర్వాత ఆఫ్‌లైన్ లో సర్వదర్శనం టోకన్లను భక్తులకు కేటాయిస్తామని తెలిపారు. అంతేకాదు .. కేసులు అదుపులోకి వస్తే.. మార్చి ఫస్ట్ నుండి శ్రీవారి ఆర్జితసేవలను పునరుద్ధరణ చేస్తామని తెలిపారు. అంతేకాదు శ్రీవారి సేవలకు భక్తులను అనుమతిచ్చె ఆవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీవారి దర్శనం టిక్కెట్లు విక్రయించే నకిలీ వెబ్‌సైట్ లో గుర్తించి డియాక్టివేట్ చేస్తున్నామని… డూప్లికేట్ వెబ్ సైట్ లను నివరించేందుకు టీటీడీ సైబర్ విభాగం నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు. అయితే టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లో దర్శనం, వసతి సేవలు పొందాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

తిరుమలలో విపత్తుల నిర్వహణపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నామని.. కొండచరియలు, బండరాళ్లు విరిగిపడే ప్రమాదాలను ముందుగానే గుర్తించే సాంకేతికతను తీసుకొస్తామని అన్నారు. ఇప్పటికే ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు, భద్రత పరమైన సమస్యలు నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చి… ఈ నెలాఖరులోగా ప్రణాళిక సమర్పించాలని రాష్ట్ర, జాతీయ విపత్తు నివారణ సంస్థలను కోరినట్లు చెప్పారు జవహర్ రెడ్డి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరింత పటిష్టంగా ప్లాస్టిక్ ‌నిషేధం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఈవో.

ఇక ఫిబ్రవరి 16న అంజనాద్రి అభివృద్ధి పనులకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. ఈ భూమిపూజ కార్యక్రమంలో పలువురు స్వామిజీలు, ఆచార్యులను పాల్గొంటారని టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే శ్రీవారి మెట్టు నడకమార్గం పునరుద్ధరణకు టెండర్లు ఖరారు చేశామని.. భక్తులకు శ్రీవారిమెట్టు నడకమార్గం అందుబాటులోకి రావటానికి 3 నెలలు పడుతుందిని తెలిపారు టీటీడీ ఈఓ జవహార్ రెడ్డి.

Also Read: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానం..2024 నుంచి అందుబాటులోకి?