IRCTC Tourism: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ
Tirupati - IRCTC Tourism: తిరుమల శ్రీవారిని(Tirumala Temple) దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం(IRCTC Tourism)..
Tirupati – IRCTC Tourism: తిరుమల శ్రీవారిని(Tirumala Temple) దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం(IRCTC Tourism) శుభవార్త చెప్పింది. ముఖ్యంగా హైదరాబాద్(Hyderabad) నగర వాసులకు ఈ వార్త ప్రయోజనకరం కానుంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే భక్తులనుద్దేశించి ప్రత్యేకంగా ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ‘తిరుపతి బాలాజీ దర్శనం’ (Tirupati Balaji Darshanam) పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందిస్తోంది.
ఇదే విషయాన్ని ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక ప్రకటికనతో పాటు.. ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. దీని ప్రకారం.. ఒక రాత్రి, రెండు రోజుల ప్యాకేజీతో ఈ టూర్ ఫిబ్రవరి 5, 12, 17, 19, 24, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా వీకెండ్‌లో రెండు రోజుల్లో తిరుపతి టూర్ ప్లాన్ చేసుకోవాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రకారం.. ఫ్లైట్‌లో తిరుపతికి తీసుకెళ్లి తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ద్వారా శ్రీవారి దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత కాణిపాకం, శ్రీనివాసమంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ దర్శనాలు కూడా చేపిస్తారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఒక రాత్రి తిరుపతిలో బస, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
‘తిరుపతి బాలాజీ దర్శనం’ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు.. ఈ ప్యాకేజీలో భాగంగా ప్రయాణం హైదరాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. పర్యాటకులు ఉదయం 9.50 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 11.10 గంటలకు తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పర్యాటకుల్ని నేరుగా హోటల్‌కు తీసుకెళ్తారు. ఆ తర్వాత కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, తిరుచానూర్ ఆలయాల సందర్శన ఉంటుంది. అప్పటికే చీకపడుతుంది కావున.. రాత్రికి తిరుపతిలోనే బస చేయాల్సి ఉంటుంది. మరుసటి రోజు అంటే ప్యాకేజీలో రెండవ రోజు ఉదయం తిరుమలకు తీసుకువెళ్తారు. తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తారు. మధ్యాహ్నం భోజనం తర్వాత శ్రీకాళహస్తి దర్శనం చేపిస్తారు. ఆ తరువాత సాయంత్రం 6.55 గంటలకు తిరుపతిలో ఫ్లైట్‌లో తిరుగుపయనం అవుతారు. రాత్రి 8.15 గంటలకు ఆ ఫ్లైట్ హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ధర ఎంతంటే.. ఐఆర్‌సీటీసీ టూరిజం తిరుపతి బాలాజీ దర్శనం టూర్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.11,125. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.11,220, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.12,905 చెల్లించాలి. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ నుంచి పలు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. తాజాగా తిరుపతి బాలాజీ దర్శనం టూర్ అందించడంతో తిరుమల శ్రీవారి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also read:
Baby Bump: ఈ మహిళ బేబీ బంప్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. సోషల్ మీడియాలో వైరల్..?
Oppo Reno 7 Pro: ఒప్పో నుంచి కొత్త ఫోన్‌లు వచ్చేశాయి.. ఒప్పో 7 సిరీస్ ఫీచర్లు, ధర వివరాలు..