AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramanujacharya Sahasrabdi: ముచ్చింత‌ల్‌కు రానున్న ప్రధాని మోడీ.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్

పీఎం నరేంద్ర మోడీ హైదరాబాద్ ​పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్​ సోమేశ్ కుమార్​ ఆఫీసర్లను ఆదేశించారు. సమతామూర్తి కేంద్రం, విగ్రహ పరిసరాలను సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు.

Ramanujacharya Sahasrabdi: ముచ్చింత‌ల్‌కు రానున్న ప్రధాని మోడీ.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్
Pm Modi
Sanjay Kasula
|

Updated on: Feb 04, 2022 | 2:15 PM

Share

PM Modi – ‘Statue of Equality’: పీఎం నరేంద్ర మోడీ హైదరాబాద్ ​పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్​ సోమేశ్ కుమార్​ ఆఫీసర్లను ఆదేశించారు. సమతామూర్తి కేంద్రం, విగ్రహ పరిసరాలను సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు. పీఎం టూర్​ను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రధాని పాల్గొనే వేదికల వద్ద భద్రతా ఏర్పాట్లతోపాటు, ట్రాఫిక్‌‌‌‌ నియంత్రణ, బందోబస్తును బ్లూబుక్‌‌‌‌ ప్రకారం అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.  వీవీఐపీ పర్యటన సమయంలో కరోనా ప్రొటోకాల్స్‌‌‌‌ పాటించేలా చూడాలని హెల్త్​సెక్రటరీని సీఎస్ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే..

వీవీఐపీ పాస్ హోల్డర్లకు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్‌‌‌‌కు ముందే ఆర్టీ పీసీఆర్​ కోవిడ్ టెస్టులు చేయాలన్నారు. పీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్​బీ అధికారులను​ ఆదేశించారు. శంషాబాద్ ఎయిర్​పోర్ట్, ఇతర వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలించాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేయాల‌ని, ఎక్కడా కూడా భద్రత విషయంలో చిన్న పొరపాటు కూడా ఉండకూడదని అధికారులను ఆదేశించారు.

వేదికల వద్ద తగు వైద్య శిబిరాలతోపాటు, నిపుణులైన వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను కూడా ఆదేశించారు సోమేష్ కుమార్. వీవీఐపీలు కోవిడ్-19 ప్రోటోకాల్‌ పాటించేలా చూడాలని, వీవీఐపీ పాస్ హోల్డర్లకు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్‌కు ముందే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు సోమేష్ కుమార్. కోవిడ్-19 స్క్రీనింగ్ బృందాలను పెద్ద సంఖ్యలో సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు సోమేష్ కుమార్.

మొదలు ఇక్రిశాట్​కు..

హైదరాబాద్​ రానున్న ప్రధాని 5వ తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు ఇక్రిశాట్ ను సందర్శించి వార్షికోత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్​లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహం ఆవిష్కరించి.. జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమంలో రామానుజాచార్య జీవన ప్రయాణం, ఆయన బోధనలకు సంబంధించిన 3డి ప్రజెంటేషన్ మ్యాపింగ్ ప్రదర్శిస్తారు. 108 దివ్య క్షేత్రాల నిర్మాణాలను కూడా ప్రధాని మోడీ సందర్శించనున్నారు.

ఇవి కూడా చదవండి: UP Assembly Election 2022: యూపీ ఎన్నికల ప్రచారంలో ఎదురుపడిన రెండు పార్టీల అగ్రనేతలు.. హాట్ హాట్ వీడియో..

Viral Video: అయ్యయ్యో వద్దమ్మా అంటూనే.. ఈ చిన్నది ఏం చేసిందో తెలుసా.. షాకింగ్ వైరల్ వీడియో..