UP Assembly Election 2022: యూపీ ఎన్నికల ప్రచారంలో ఎదురుపడిన రెండు పార్టీల అగ్రనేతలు.. హాట్ హాట్ వీడియో..

ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీల నాయకులు రంగంలోకి దిగారు. పోటా పోటీగా జరుగుతున్న ఎన్నికల్లో ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. గెలుపు..

UP Assembly Election 2022: యూపీ ఎన్నికల ప్రచారంలో ఎదురుపడిన రెండు పార్టీల అగ్రనేతలు.. హాట్ హాట్ వీడియో..
Priyanka Gandhi Akhilesh Yadav Jayant Chaudhary Came Face To Face
Sanjay Kasula

|

Feb 04, 2022 | 11:43 AM

ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీల నాయకులు రంగంలోకి దిగారు. పోటా పోటీగా జరుగుతున్న ఎన్నికల్లో ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. గెలుపు తమ పార్టీది అంటే తామే అధికారంలోకి రాబోతున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో జరుగనున్న మొదటి దశ పోలింగ్‌కు ముందు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పశ్చిమ యుపి స్థానాల్లో తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గురువారం బులంద్‌షహర్‌లో తన మద్దతుదారులతో ఎన్నికల ప్రచారంలో ఉండగా.. ఆమె సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్‌ఎల్‌డి అధినేత జయంత్ చౌదరిలను ఒకే చోట ఎదురుపడ్డారు.

అఖిలేష్ యాదవ్,  జయంత్ చౌదరి కలిసి ప్రచారం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రెండు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. గురువారం ఇద్దరు నేతలు కూడా బులంద్‌షహర్‌లోని అదే ప్రాంతానికి ప్రచారానికి చేరుకున్నారు. ప్రియాంక గాంధీ కాన్వాయ్ ఎదురుగా రావడంతో ఇరువైపులా నేతలు ఆపి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సమావేశం అనంతరం అఖిలేష్ యాదవ్ “ఏక్ దువా-సలామ్ ~ తెహజీబ్ కే నామ్” అని ట్వీట్ చేశారు. అదే సమయంలో, ప్రియాంక గాంధీ కూడా ఒక వీడియోను ట్వీట్ చేసింది. దానితో ఆమె “హమారీ భీ ఆప్కో రామ్ రామ్” అని రాశారు. ఈ వీడియోలో ప్రియాంక గాంధీ అఖిలేష్ యాదవ్,  జయంత్ చౌదరి కరచాలనం చేస్తూ అభివాదం చేస్తూ కనిపించారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తుపై చర్చలు జరిగాయి. అయితే ఈ రెండు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు కుదరలేదు. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇక రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ కలిసి రోడ్ షో కూడా చేశారు. అయితే ఆ ఎన్నికల్లో వారి కూటమి బీజేపీ చేతిలో ఓడిపోయింది.

ఇవి కూడా చదవండి: Ramanujacharya Sahasrabdi: ఆధ్యాత్మిక సందడిగా ముచ్చింతల్ ఆశ్రమము.. రామనుజాచార్యుల వెయ్యి ఏళ్ల పండగలో మూడవ రోజు..

Mark Zuckerberg: కుప్పకూలిన మెటా షేర్లు.. 200 డాలర్లకు పైగా డమాల్.. ఎందుకు ఇలా జరిగిందో తెలుసా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu