Medaram Jatara: కుటుంబ సమేతంగా మేడారం జాతరకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీ కోసం టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

Medaram Jatara:ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన మహా సమ్మేళం మేడారం జాతర ఈ నెల 16 నుంచి 19 వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్నది. ఇప్పటికే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర..

Medaram Jatara: కుటుంబ సమేతంగా మేడారం జాతరకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీ కోసం టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
Tsrtc Cmd Vc Sajjanar
Follow us
Surya Kala

|

Updated on: Feb 04, 2022 | 3:34 PM

Medaram Jatara:ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన మహా సమ్మేళం మేడారం జాతర ఈ నెల 16 నుంచి 19 వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్నది. ఇప్పటికే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర (Sammakka-Saralamma Jatara)కు తెలంగాణ(Telangana) ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో మేడారం వెళ్ళే సమ్మక్క, సారలమ్మ భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. ఈ సందర్భంగా మేడారం జాతరతో ఆర్టీసీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు సజ్జనార్. మేడారం జాతరకు వెళ్ళే భక్తుల కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులను నడపనున్నామని.. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ అన్ని ఏర్పాట్లను చేసిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 50 ఏళ్లుగా ఆర్టీసీ మేడారానికి బస్సులను నడుపుతోందన్నారు. మొదట రెండంకెల బస్సులతో 1970లో స్టార్ట్ అయ్యిందని.. ప్రస్తుతం 7వందలకు ఈ సంఖ్య పెరిగిందన్నారు.

గత ఏడాది 19లక్షలకు పైగా భక్తులను మేడారం చేర్చామన్నారు. గత ఏడాది 3వేలకు పైగా బస్సులు- 50వేలకు పైగా ట్రిప్స్ రన్ చేశామని చెప్పారు. అంతేకాదు తాము మేడారం జాతరకు బస్సులను నడపడాన్ని రెవెన్యూగా చూడలేదని సజ్జనార్ తెలిపారు. గత ఏడాది 30 కోట్ల రెవెన్యూ వచ్చిందని చెప్పారు. ఈ సారి 3845 బస్సులు నడపనున్నామని… 51 పాయింట్స్ నుంచి మేడారానికి ఆర్టీసీ బస్సులు నడుస్తాయని చెప్పారు. ఇతర రాష్ట్రాలు మహారాష్ట్రతో పలు ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతున్నామని చెప్పారు సజ్జనార్. అంతేకాదు ఎక్కడైనా ఒక ప్రాంతంలో 30మంది ప్రయాణికులు మేడారంకు వెళ్తుంటే.. అటువంటి వారు తమకు ఫోన్ చేసే.. వారి దగ్గరకే బస్సుని పంపుతామని తెలిపారు.. అలా బస్సుకోసం ఈ నంబర్ 04030102829 కి కాల్ చేస్తే బస్సుని భక్తుల వద్దకే పంపుతామని సజ్జనార్ చెప్పారు.

Also Read:

ఒప్పో నుంచి కొత్త ఫోన్‌లు వచ్చేశాయి.. ఒప్పో 7 సిరీస్‌ ఫీచర్లు, ధర వివరాలు..