VIP Security: జడ్ ప్లస్, జడ్, వై, వై ప్లస్, ఎక్స్ కేటగిరీ భద్రత అంటే ఏమిటో తెలుసా.. వీఐపీలకు ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందంటే..

భారత్‌లో రాజకీయ నేతలు, ప్రముఖులకు సాధారణంగా జడ్ ప్లస్, జడ్, వై, వై ప్లస్, ఎక్స్ కేటగిరీల భద్రత ఉంటుంది. వీరిలో...

VIP Security: జడ్ ప్లస్, జడ్, వై, వై ప్లస్, ఎక్స్ కేటగిరీ భద్రత అంటే ఏమిటో తెలుసా.. వీఐపీలకు ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందంటే..
Security
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 04, 2022 | 3:28 PM

భారత్‌లో రాజకీయ నేతలు, ప్రముఖులకు సాధారణంగా జడ్ ప్లస్, జడ్, వై, వై ప్లస్, ఎక్స్ కేటగిరీల భద్రత ఉంటుంది. వీరిలో కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రముఖ నేతలు, సీనియర్ అధికారులు ఉంటారు. అలాగే భారత నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా, ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవా‌లకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పటి వరకూ ఆర్మీ చీఫ్‌కు మాత్రమే జడ్ ప్లస్ భద్రత ఉండేది. తాజాగా నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లను కూడా ఈ జాబితాలో చేర్చుతున్నామని కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా దళాల చీఫ్‌లపై దాడికి ఆస్కారం ఉండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం సెక్రటరీ రాజీవ్ గౌబా‌లతో కూడిన కమిటీ భద్రత పెంపు నిర్ణయం తీసుకుంది. వీవీఐపీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులకు మాత్రమే దేశంలోనే అత్యున్నత స్థాయి జడ్ ప్లస్ భద్రత ఉండేది. ఇకనుంచి త్రివిధ దళాధిపతులకు కూడా జడ్ ప్లస్ భద్రత ఉండనుంది.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, సుప్రీం, హైకోర్టు జడ్జిలు, గవర్నర్లు, సీఎంలు, కేంద్ర కేబినెట్ సభ్యులకు మాత్రమే జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొంత మందికి జడ్ ప్లస్ సెక్యూరిటీ పొందుతున్నారు. దేశంలో ఇలా 63 మంది జడ్ ప్లస్ కేటగిరి భద్రత పొందుతున్నారు. ఇందులో రాహుల్ గాంధీ, చంద్రబాబు, ములాయం సింగ్ యాదవ్, మాయవతి వంటి వారు ఉన్నారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ కింద 24 గంటలూ భద్రత ఉంటుంది. కనీసం 36 మంది భద్రతా సిబ్బంది షిప్టుల వారీగా కాపలా కాస్తారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నవారికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్, సీఐఎస్ఎఫ్‌లు భద్రత నిర్వహిస్తారు. కొన్నిసార్లు ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది కూడా ఎస్కార్ట్‌గా ఉంటారు. జడ్ ప్లస్ కేటగిరీలో భాగంగా రక్షణ కల్పించే ఎన్ఎస్జీ కమాండోల దగ్గర ఎంపీ5 సబ్ మెషిన్ గన్లు, ఏకే-47 రైఫిళ్లు సహా అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. జడ్ ప్లస్ సెక్యూరిటీలో భాగంగా వీవీఐలకు పైలట్, ఎస్కార్ట్ కారు నిరంతరం అందుబాటులో ఉంటాయి.

జడ్ కేటగిరీలో ఉన్నవారికి 22 మంది రక్షణ కల్పిస్తారు. ఈ కేటగిరీలో వారికి ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ జవాన్లు, అధికారులను సెక్యురిటీగా నియమిస్తారు. ఈ కేటగిరీ సెక్యూరిటీలో ఎస్కార్ట్స్, పైలెట్ వాహనం కూడా ఇస్తారు.

‘వై’ కేటగిరీలో 11 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. వారిలో ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ (పీఎస్ఓ)లు ఉంటారు. వై ప్లస్’ కేటగిరీ సెక్యూరిటీలో ఒక ఎస్కార్ట్ వాహనం, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అదనంగా ఒక గార్డ్ కమాండర్, నలుగురు గార్డులను నియమిస్తారు. ఈ గార్డుల్లో ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ అధికారి మిగతా ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. వీరి వద్ద ఆటోమేటిక్ ఆయుధాలు ఉంటాయి. ఎక్స్ కేటగిరీలో ఉన్న వారికి కనీసం ఇద్దరు రక్షణ కల్పిస్తారు.

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీద్ భద్రత దృష్ట్యా సీఆర్పీఎఫ్ బలగాలతో జడ్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసదుద్దీన్ ఒకపై ఎక్కడికి వెళ్లినా సీఆర్పీఎఫ్ జవాన్లు వెంట ఉండేలా రక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ అధికారింగా ప్రకటించలేదు.

Read Also.. నువ్వు మా ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నావ్.. వెంటనే నీ భర్తకు విడాకులిచ్చేయ్!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!