AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: తెలంగాణాలో మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు.. ఏపీలో దట్టమైన పొగమంచు..

Weather Report: తెలంగాణ(Telangana)లో మరో రెండు రోజుల పాటు..వాతావరణం పొడిగా ఉంటుందని.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని.. హైదరాబాద్‌(Hyderabad) వాతావరణ కేంద్రం వెల్లడించింది..

Weather Report: తెలంగాణాలో మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు.. ఏపీలో దట్టమైన పొగమంచు..
Ap Weather
Surya Kala
|

Updated on: Feb 04, 2022 | 10:22 PM

Share

Weather Report: తెలంగాణ(Telangana)లో మరో రెండు రోజుల పాటు..వాతావరణం పొడిగా ఉంటుందని.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని.. హైదరాబాద్‌(Hyderabad) వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రకటించింది. హైదరాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ సహా పలు జిల్లాల్లో 11 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని తెలిపింది. ఉదయం వేళలో పొగమంచు ఏర్పడుతుందని తెలిపింది. నైరుతి దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 6 కిలో మీటర్ల నుంచి 8 కిలో మీటర్ల వరకూ వీచే అవకాశం ఉంటుంది.

ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా మరో రెండు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఏపీలో తక్కువ ఎత్తులో నేడు నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతోరాగల మూడు రోజుల వరకూ వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దట్టమైన పొగ మంచు ఏర్పడుతుంది. ముఖ్యంగా విశాఖ మన్యం ప్రాంతాల్లో మంచు విస్తరిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలు చలికి వణుకుతున్నారు.

Also Read:

మీ ఆశీస్సుల వల్లే కరోనా నుంచి కోలుకున్నాను..’శేఖర్‌’ సినిమా సాంగ్‌ లాంఛ్‌లో రాజశేఖర్‌ భావోద్వేగం..

Follow Us
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!