దంతాలు, పెదవుల నిర్మాణం మీ అదృష్టాన్ని చెప్పేస్తాయి.. ఇంట్రస్టింగ్ వివరాలు మీకోసం..
దంతాలు, పెదవుల నిర్మాణం వ్యక్తి అందాన్ని మరింత ఇనుమడింపజేస్తాయి. ఎదుటి వ్యక్తిని చూడగానే ముందుగా ఆకట్టుకునేది వారి పెదవులు, దంతాల మాటుగా వచ్చే అందమైన చిరునవ్వు.

దంతాలు, పెదవుల నిర్మాణం వ్యక్తి అందాన్ని మరింత ఇనుమడింపజేస్తాయి. ఎదుటి వ్యక్తిని చూడగానే ముందుగా ఆకట్టుకునేది వారి పెదవులు, దంతాల మాటుగా వచ్చే అందమైన చిరునవ్వు. దంతాలు, పెదవులు ఆ చిరునవ్వును ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వ్యక్తి దంతాలు, పెదవుల నిర్మాణం వారి అదృష్టాన్ని తెలియజేస్తుందట. అంతేకాదు.. వారి ప్రవర్తన, వారు తీసుకునే నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తుందట. పెదవులు, దంతాల నిర్మాణం ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పెదవుల నిర్మాణం ఆధారంగా వ్యక్తిత్వం..
1. రెండు పెదవులు సమానంగా, అందంగా ఉంటే..
ఒక వ్యక్తి రెండు పదవులు సమానంగా, అందంగా ఉంటే.. వారు సత్యవంతులట. అంతేకాదు.. వారు ధర్మవంతులు కూడా. వీరు ఎప్పుడూ మధురంగా మాట్లాడతారు. ఇతరులతో మంచిగా వ్యవహరిస్తారు. పరోపకారిగా ఉంటారు. వీరు అదృష్టవంతులు.




2. రెండు పెదవులు మందంగా ఉంటే..
ఈ రకమైన వ్యక్తికి సన్నని పొట్ట ఉంటుంది. వీరు ఏ విషయాన్నీ రహస్యంగా ఉంచుకోలేరు. ఏదైనా తినడాన్ని బాగా ఇష్టపడుతారు.
3. రెండు పెదవులు సన్నగా ఉంటే..
వీరు సాదాసీదాగా ఉంటారు. పోరాడే తత్వం కలిగి ఉంటారు. వీరిలో వయసు పెరిగే కొద్దీ సంతోషం పెరుగుతుంది.
4. పై పెదవి మందంగా ఉండి.. కింది పెదవి సన్నగా ఉంటే..
ఇలాంటి వ్యక్తులు ప్రభావశీలురుగా ఉంటారు. రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడుతారు. ప్రకృతితో మమేకమవుతారు.
5. కింది పెదవి పెద్దగా ఉండి.. పై పెదవి సన్నగా ఉంటే..
ఇలాంటి వ్యక్తులు అహంకారపూరితంగా ఉంటారు. వీరు తమ అభిప్రాయమే కరెక్ట్ అని నిరూపించేందుకు ఎంతటి వరకైనా వెళతారు. ఇక ఇతరుల బాధలను వినడంలో నిజాయితీగా ఉంటారు.
6. ఎర్రటి పెదవులు ఉన్నవారు..
ఎర్రటి పెదవులు కలిగిన వీరు పరాక్రమం కలిగి ఉంటారు. ఉత్సాహంగా ఉంటారు. కోరికలు ఎక్కువగా ఉంటాయి. ధనవంతులుగా ఉండేందుకు కష్టపడుతారు.
7. నల్లటి పెదవులు ఉన్నవారు..
వీరు ఎక్కువగా అబద్ధాలు చెబుతుంటారు. అన్ని వేళలా బాధపడుతుంటారు.
దంతాల నిర్మాణం ఆధారంగా వ్యక్తిత్వం..
1. సమలేఖన పళ్లు కలిగి ఉంటే..
అదృష్టం, సంపదకు చిహ్నంగా ఉంటారు. వీరి జీవితంలో అన్ని రకాల ఆనందాలను అనుభవిస్తారు. ఇతరులతో మర్యాదగా మెలుగుతారు.
2. దంతాలు నలుపు రంగులో ఉంటే..
సంఘర్షణ, వైఫల్యం సంకేతం వారి దంతాలలో ఉంటుంది. వీరు నిజాన్ని ఇష్టపడరు. నిజాలు మాట్లాడరు. మోసపూరిత జీవితాన్ని గడుపుతారు.
3. దంతాల మధ్య సందు ఉంటే..
ముందు రెండు దంతాల మధ్య ఖాళీలు, కావిటీస్ ఉన్న పురుషులు గొప్ప అదృష్టవంతులు. తెలివైనవారు. విద్యావంతులు. దాతృత్వం కలిగి ఉంటారు. కానీ దంతాల మధ్య ఖాళీలు ఉన్న స్త్రీలు దురదృష్టానికి ప్రతిబింబం వంటివారు. వీరు ఎప్పుడూ బాధతోనే ఉంటారు.
4. ముందు దంతాలు పెద్దగా ఉంటే..
వీరు మాటల్లో విజ్ఞత ఉంటుంది. శత్రువులను జయిస్తారు. ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతారు.
5. ఎగువ, దిగువ పళ్లు సమానంగా ఉంటే..
ఇలాంటి వ్యక్తులు చాలా తెలివైన వారు. నిస్వార్థ ఆలోచనతో ప్రజా సేవ చేస్తారు.
6. పన్ను మీద పన్ను ఉంటే..
వీరు ధైర్యంగా, హేతుబద్ధంగా ఉంటారు. శత్రువులను సునాయాసంగా ఓడిస్తారు.
7. ఎగుడుదిగుడు పళ్లు ఉంటే..
ఇలాంటి వ్యక్తి సరైన నిర్ణయం తీసుకుంటారు. దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించి, మనస్సాక్షి మాట వింటారు.
8. పుట్టిన పెళ్లలకు పళ్లు ఉంటే..
మరణానికి సూచనగా పరిగణించబడుతుంది. తల్లిదండ్రులు గానీ, కుటుంబ సభ్యుల మరణానికి సూచికగా పేర్కొంటారు.
9. శిశువు ఎగువ దంతాలు విరిగిపోతే..
ఆ శిశువు జీవితంలో అత్యంత క్రూరంగా మారుతాడని సంకేతం.
10. దంతాల కదలిక సమస్యలు ఉంటే..
రాత్రిపూట దంతాలు కదిలిపోతే.. అది దురదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
