AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhyanga Snanam: పాప కర్మలు పోగొట్టే అభ్యంగన స్నానం.. ఎప్పుడు, ఎలా చేయాలి?

పండగలు అంటే పిండి వంటలు, కొత్త బట్టలు మాత్రమే కాదు, కొన్ని ప్రత్యేక సంప్రదాయాలు కూడా. అలాంటి సంప్రదాయాలలో ఒకటి అభ్యంగన స్నానం. దీన్నే మనం తలంటు స్నానం అని కూడా అంటాం. దీపావళి, దసరా.. ఇలా ముఖ్యమైన పండుగలకు తప్పకుండా ఈ స్నానం చేస్తాం. అయితే, ఈ ఆచారం వెనుక మతపరమైన కారణాలతో పాటు ఎన్నో శాస్త్రీయ, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అభ్యంగన స్నానం ప్రాముఖ్యత, దాని వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Abhyanga Snanam: పాప కర్మలు పోగొట్టే అభ్యంగన స్నానం.. ఎప్పుడు, ఎలా చేయాలి?
Abhangana Snanam Importance
Bhavani
|

Updated on: Aug 27, 2025 | 9:28 AM

Share

మన భారతీయ సంప్రదాయాలలో ప్రతీ ఆచారానికి ఒక ఆరోగ్య రహస్యం దాగి ఉంటుంది. అలాంటి ఆచారాలలో ఒకటి అభ్యంగన స్నానం. దీన్నే మనం తలంటు స్నానం అని కూడా అంటాం. ముఖ్య పండగలకు తప్పకుండా ఈ స్నానం చేస్తారు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. మన శరీరం, మనస్సుకు ఆరోగ్యం, ప్రశాంతత అందించే ఒక అద్భుతమైన పద్ధతి.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

పండగ రోజున, అభ్యంగన స్నానం చేస్తే పాపాలు పోతాయని పురాణాలు చెబుతాయి. నరక బాధలు తొలగి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఈ స్నానం చేయడం వల్ల శరీరం పవిత్రమవుతుంది. చెడు శక్తులు తొలగిపోతాయని, శుభాలు కలుగుతాయని నమ్మకం. పండగకు ముందు శరీరం, మనస్సు శుభ్రం చేసుకోవడానికి ఇది ఒక మార్గం.

ఆయుర్వేద, శాస్త్రీయ ప్రయోజనాలు

ఆయుర్వేదం ప్రకారం, అభ్యంగన స్నానం శరీరానికి అనేక ప్రయోజనాలు ఇస్తుంది. పండగల సమయం చలికాలం ఆరంభం. ఈ సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది. దానివల్ల చర్మం పొడిబారే అవకాశం ఉంది. నూనెతో ఒంటిని మర్దన చేయడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

నూనె మర్దన రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దానివల్ల శరీర కండరాలు రిలాక్స్ అవుతాయి. ఒత్తిడి, అలసట తగ్గుతాయి. నరాల వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. పండగకు ముందు ఇంటిని శుభ్రం చేయడం, పిండి వంటలు చేయడం లాంటి పనుల వల్ల వచ్చే అలసటను ఇది దూరం చేస్తుంది. నూనెతో చేసే మసాజ్ కండరాలు, ఎముకలను బలంగా మారుస్తుంది. పండగలో కొత్త శక్తి, ఉత్సాహం నింపడానికి ఈ స్నానం సహాయపడుతుంది.

సంప్రదాయం, ఆరోగ్యం కలయిక

అభ్యంగన స్నానం ఒక సాంస్కృతిక వారసత్వం. ఇందులో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, బాదం నూనె వంటివి మర్దనకు ఉపయోగిస్తారు. వీటిలో విటమిన్లు, పోషకాలు ఉంటాయి. ఇవి చర్మానికి మంచి పోషణ ఇస్తాయి. అభ్యంగన స్నానం కేవలం శరీరాన్ని శుభ్రం చేయడమే కాదు, మనసును కూడా ప్రశాంతం చేస్తుంది. అందుకే తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం. ఇది మన సంస్కృతిలో భాగం.

Follow Us