AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీతి కథ: మెగాస్టార్ చెప్పిన అక్షర సత్యం.. ఇలా చేస్తే విజయం మీ సొంతం

సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న చిరు.. ఇప్పుడు కొత్త సినిమాను అనౌన్స్ చేశారు.

నీతి కథ: మెగాస్టార్ చెప్పిన అక్షర సత్యం.. ఇలా చేస్తే విజయం మీ సొంతం
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: May 26, 2026 | 12:07 PM

Share

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అలాగే బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మెగాస్టార్. సినిమాలతోనే కాదు చిరంజీవి తన జీవితానుభవాలను, స్ఫూర్తిదాయకమైన సందేశాలను తరచుగా పంచుకుంటూ ఉంటారు. ఈసారి ఆయన కప్ప కథ చెప్పారు. దాని ద్వారా నెగిటివిటీని ఎలా అధిగమించాలో వివరించారు మెగాస్టార్. ఒక తాడు సాయంతో ఓ బావిలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న కొన్ని కప్పల కథను ఆయన చెప్పారు. ” బావిలోని కప్పలు తాడు ఎక్కుతుండగా, కింద ఉన్న మిగిలిన కప్పలు “ఇది అసాధ్యం, మీరు ఎక్కలేరు, మీరు కింద పడిపోతారు” అని నిరుత్సాహపరిచే మాటలు పదేపదే చెబుతూ ఉన్నాయట. ఈ ప్రతికూల మాటలు విన్న చాలా కప్పలు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నాయి, మరికొన్ని ఆత్మవిశ్వాసం కోల్పోయి మధ్యలోనే కింద పడిపోయాయి. అయితే, ఒక కప్ప మాత్రం అన్ని అడ్డంకులను దాటుకుని తాడు పైదాకా విజయవంతంగా చేరుకొని ఆ బావి నుంచి బయట పడిందట.. మిగిలిన కప్పలు దానిని అభినందించినప్పుడు, ఆ కప్ప చెవిటిదని తెలిసిందట. అది కిందనున్న నెగిటివ్ మాటలను వినలేకపోయింది, అందువల్ల తన లక్ష్యంపై మాత్రమే దృష్టి సారించగలిగిందని చిరంజీవి చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి : వారెవ్వా.. ఏముంది మావ సాంగ్.! వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఊపేస్తోంది

ఈ కథను వివరించిన తర్వాత, చిరంజీవి ఈ నీతిని తన వ్యక్తిగత అనుభవాలకు అన్వయించారు. సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు లేదా ఏదైనా రంగంలో విజయం సాధించాలనుకున్నప్పుడు, మన చుట్టూ ఉండే ప్రతికూల శక్తులకు “చెవిటివారై” ఉండటం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న రోజుల్లో.. తన కెరీర్ ప్రారంభ దశలో, ఆయన చెన్నైలోని పాండి బజార్ వైపు వెళ్లేవారు కాదట. పాండి బజార్‌లో అవకాశాలను సద్వినియోగం చేసుకోనివాళ్లు, అవకాశాలు రానివాళ్లు, నిరాశ చెందిన వ్యక్తులు ఎక్కువగా ఉంటారని.. అలాంటి ప్రతికూల వాతావరణంలోకి వెళితే, తనలో ఉన్న ఆత్మవిశ్వాసం సడలిపోతుందని భయపడేవాడిని అని తెలిపారు.

ఇది కూడా చదవండి :ఫా…! ఏం గుండె రా వాడిది.!! భర్త పక్కన ఉండగానే సమంతకు ఐ లవ్ యు చెప్పిన వ్యక్తి..

అలాగే ఆయన మాట్లాడుతూ.. ఎవరూ తనకు గురువులుగా ఈ విషయాన్ని చెప్పలేదని, ఏ పుస్తకాలు కూడా చెప్పలేదని, కేవలం తన కామన్ సెన్స్ ద్వారా ఇది తీసుకున్నానని తెలిపారు. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు.. నేరుగా తినడానికి వెళ్లి, తన గదికి లేదా ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌కు తిరిగి వెళ్లేవారు తప్ప, ఎవరితోనూ నెగిటివ్ విషయాలు  మాట్లాడటం చేసేవాడిని కాదు. “నువ్వు సినిమా యాక్టర్ అవుదాం అనుకున్నావా.? నీ మొహం ఎప్పుడైనా చూసుకున్నావా?” వంటి నెగిటివ్ కామెంట్స్  ఆ సమయంలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని ఆయన వివరించారు. చివరగా, చిరంజీవి  ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఎప్పుడూ నెగటివ్‌గా ఆలోచించొద్దు. మీరు నూటికి నూరు శాతం కృషి చేస్తే, కచ్చితంగా విజయం సాధిస్తారు. ఇది కేవలం సినీ పరిశ్రమకే కాకుండా, జీవితంలోని ఏ రంగంలోనైనా విజయవంతం కావడానికి ఇది ఒక ముఖ్యమైనది అని చిరంజీవి తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Nagarjuna: ఆ రోజు నన్ను చూసి అందరూ నవ్వారు.. ఆతర్వాత మళ్లీ దాని జోలికి వెళ్ళలేదు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us