Sachin Pilot: త్వరలోనే సచిన్ పైలట్ BJPలో చేరుతారా? క్లారిటీ ఇచ్చేసిన కాంగ్రెస్ నేత
మాజీ కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్(Jitin Prasad) రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీ తీర్థంపుచ్చుకోవడం తెలిసిందే. ఇప్పటికే జ్యోతిరాదిత్య సింధియా కమలం పార్టీ గూటికి చేరిపోగా..తాజాగా జితిన్ ప్రసాద్ పార్టీని వీడటంతో కాంగ్రెస్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
మాజీ కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీ తీర్థంపుచ్చుకోవడం తెలిసిందే. ఇప్పటికే జ్యోతిరాదిత్య సింధియా కమలం పార్టీ గూటికి చేరిపోగా..జితిన్ ప్రసాద్ పార్టీని వీడటంతో కాంగ్రెస్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జితిన్ ప్రసాద్ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో ఎవరు చేరబోతున్నారన్న చర్చ జరుగుతోంది. రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కూడా త్వరలోనే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరే యోచనలో ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి మరింత ఆజ్యం పోస్తూ యూపీ బీజేపీ నాయకురాలు రీటా బహుగుణ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను స్వయంగా సచిన్ పైలట్‌తో మాట్లాడానని.. త్వరలోనే ఆయన బీజేపీలోకి వస్తానని చెప్పారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సచిన్ పైలట్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.
అయితే బీజేపీ నాయకురాలు రీటా బహుగుణ జోషి వ్యాఖ్యలను సచిన్ పైలట్ తోసిపుచ్చారు. తనతో మాట్లాడే ధైర్యం ఆమెకు లేదన్నారు. బహుశా సచిన్ టెండుల్కర్‌తో ఆమె మాట్లాడి ఉండొచ్చని..తనతో మాట్లాడలేదని వ్యాఖ్యానించారు.తద్వారా తాను త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారాయన. తాను బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ.. సచిన్ పైలట్ జైపూర్ నుంచి హస్తినకు చేరుకున్నారు.
సచిన్ పైలట్ బీజేపీ గూటికి చేరుపోతారని గతంలోనూ పలుసార్లు పుకార్లు వినిపించాయి. రాజస్థాన్ సీఎం అశ్లోక్ గెహ్లాట్‌తో విబేధాల కారణంగా ఆయన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. అప్పట్లోనూ ఆయన, తన మద్ధతుదారులతో కలిసి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ప్రచారం జరిగింది.
ఇవి కూడా చదవండి..
ప్రాణవాయువు కోసం లక్షల మొక్కలు నాటి… అదే ప్రాణవాయువు అందక మృతి చెందిన ట్రీ మ్యాన్
అవన్నీ రూమర్సే అంటూ కొట్టిపారేసిన హాట్ బ్యూటీ.. బిగ్ బాస్ ఎంట్రీ పై పాయల్