Covid-19: ప్రాణవాయువు కోసం లక్షల మొక్కలు నాటి… అదే ప్రాణవాయువు అందక మృతి చెందిన ట్రీ మ్యాన్
Covid-19 ప్రకృతి పచ్చదనం కోసం అరపడ్డారు.. అందరికీ స్వచ్ఛమైన గాలి అందించడానికి అర్హనిసలు కష్టపడ్డారు. చివరకు తనకు ఆ ప్రాణవాయువే అందక మృతి..
Covid-19 ప్రకృతి పచ్చదనం కోసం అరపడ్డారు.. అందరికీ స్వచ్ఛమైన గాలి అందించడానికి అర్హనిసలు కష్టపడ్డారు. చివరకు తనకు ఆ ప్రాణవాయువే అందక మృతి చెందారు. తన గ్రామంలో నివసిస్తున్న అందరికీ స్వఛ్చమైన ప్రాణవాయువు అందాలని పరితపించిన ఆయన కరోనా బారిన పడి చివరి రోజుల్లో అదే ప్రాణావాయువు కోసం అలమటిస్తూ మరణించారు. ఈ దారుణ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో గల ధబ్లాన్ గ్రామంనివాసి హరదయాళ్ సింగ్(67). ఈయన గత పుష్కర కాలం నుంచి నిన్నా మొన్నటి వరకూ ప్రతి రోజూ ఉదయ్యానే లేవడం..సైకిల్‌కు తగిలించిన బుట్ట నిండా మొక్కలు, మట్టి నిపుకోవడం. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్కడో మొక్క నాటడం. ఇదే హరదయాళ్ సింగ్ దినచర్య. తన గ్రామం పచ్చదనంతో కళకళలాడాలని అయన కోరిక.. అందుకే అందరూ హరదయాళ్ సింగ్ ను ట్రీ మ్యాన్ గా పిలిచేవారు.
గత నెల మే 17 న హరదాయళ్ సింగ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే అప్పటికే ఆయనకు ఊరి తిత్తుల పై ప్రభావం చూపించింది. దీంతో ఆయనకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. దీంతో.. గ్రామస్థులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్చేందుకు ప్రయత్నాలు చేశారు.. ఆక్సిజన్ బెడ్ల కొరత ఉండటంతో.. గ్రామస్థులు చేసిన ఎన్నో ప్రయత్నాల తర్వాత చివరకు చండీగఢ్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించారు.
అయితే ఆ ఆస్పత్రిలో వెంటిలేటర్ సదుపాయం లేకపోవడంతో.. సాధారణ ఆక్సిజన్ సిలిండర్లతోనే వైద్యం అందించాయి ఆస్పత్రి వర్గాలు. పరిస్థితి చేజారిన తర్వాత వెంటిలేటర్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మే 23న ఆయనకు వెంటిలేటర్ తో చికిత్స ఇవ్వడం ప్రారంభించారు. అప్పటికే హరదాయళ్ సింగ్ పరిస్థితి చేజారిపోయింది. మృత్యువుతో పోరాడి అలసిపోయి. ఊపిరి తీసుకోలేక అవస్థ పడుతూ మే 25న హరదయాళ్ మరణించారు.
హరదయాళ్ మరణం గ్రామస్థుల కన్నీరు పెట్టించింది. ప్రజలకు ఆక్సిజన్ అందించేందుకు శ్రమిస్తూ.. ఎన్నో మొక్కలు నాటిన బా భర్త చివరకు ఊపిరి అందక అవస్థపడుతూ మరణించారు.. ఇదేనేమో విధిరాత అంటూ భార్య కుల్విందర్ కౌర్ కన్నీరు మున్నీరవడం చూపరులను కంట కన్నీరు తెప్పిస్తుంది.
Also Read: కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఫుల్ శాలరీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం