P.Siddhartha Reddy: పొలిటిక్స్ పార్టీ డాట్ కామ్ జర్నల్ వ్యవస్థాకులు సిద్ధార్థ రెడ్డి కన్నుమూత
P. Siddhartha Reddy: పొలిటిక్స్ పార్టీ డాట్ కామ్ జర్నల్ వ్యవస్థాకులు సిద్ధార్థ రెడ్డి మరణించారు. వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన సిద్ధార్థరెడ్డి రాజీవ్‌గాంధీకి అత్యంత సన్నిహితులు.
పొలిటిక్స్ పార్టీ డాట్ కామ్ జర్నల్ వ్యవస్థాకులు సిద్ధార్థ రెడ్డి మరణించారు. వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన సిద్ధార్థరెడ్డి రాజీవ్‌గాంధీకి అత్యంత సన్నిహితులు. రాజీవ్‌గాంధీ ప్రధాని పదవిలో ఉన్నప్పుడు, విపక్షంలో ఉన్నప్పుడూ కూడా ఎప్పుడూ ఆయనకు వెన్నంటే ఉండేవారు సిద్ధార్థరెడ్డి. రాజీవ్‌గాంధీ మరణాంతరం.. బీజేపీలో చేరారు. ఆ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కూడా పనిచేశారు. స్వచ్ఛమైన రాజకీయాలపై ఉన్న ఆపేక్ష.. తర్వాతి కాలంలో రాజకీయాలు మారుతూ వచ్చిన తీరుపై సునిశిత పరిశీలన చేసేవారు సిద్దార్థ. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాల్లోనూ వస్తున్న మార్పులు, పాలనా పరమైన అంశాలను విశ్లేషిస్తూ పాలిటిక్స్ పార్టీ డాట్ కామ్ అనే జర్నల్ కూడా నిర్వహించారు సిద్దార్థ.
ప్రస్తుత రాజకీయాలపై పొలిటికల్ పార్టీ డాట్ కామ్ జర్నల్‌లో ఎన్నో కథనాలను రాశారు. రాజకీయాలు మారుతూ వచ్చిన తీరుపై సునిశిత పరిశీలన చేసే సిద్ధార్థ రెడ్డి అద్భుతమైన రచనలు చేశారు. భారతదేశ రాజకీయాల్లో సిద్ధార్థ రెడ్డి ముద్ర కనిపిస్తుంది. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో మంచి వ్యూహం కర్తగా పనిచేశారు.. దేశంలోని భిన్న రుచుల ప్రజలదరి నాడిని పట్టడంలో సిద్ధార్థ రెడ్డి దిట్ట.