AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazing Benefits: పాలలో తేనె కలిపి తాగుతున్నారా..! ఎలాంటి ప్రయోజనాలు.. కలిగే నష్టాలు తెలుసుకోండి..!

Milk with honey benefits: పాలతో తేనెను కలిసి క్రమం తప్పకుండ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా లాభాలు. ముఖ్యంగా..

Amazing Benefits: పాలలో తేనె కలిపి తాగుతున్నారా..! ఎలాంటి ప్రయోజనాలు.. కలిగే నష్టాలు తెలుసుకోండి..!
Milk With Honey
Sanjay Kasula
|

Updated on: Jun 11, 2021 | 2:21 PM

Share

పాలు, తేనెలో ఎన్నో పోషకవిలువలున్నాయి. అవి విడివిడిగానే ఎంతో మేలు చేస్తే, కలిపి ఇంకెంత మేలు చేస్తాయో. వీటిని తాగడం వల్ల ఆరోగ్యంతోపాటు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని తేనెను ఏ విధంగా సేవించినా.. ప్రయోజనాలే. ఎన్నో ఔషధాలు ఉన్న తేనెను క్రమం తప్పకుండ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా లాభాలు. తేనెలో ఫ్రూట్ గ్లూకోజ్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫేట్, సోడియం, క్లోరిన్, పొటాషియం, మెగ్నీషియం వంటి లక్షణాలు ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియాల నుంచి మనల్ని రక్షించడంలో సహాయపడతాయి. తేనె ( Honey ) లో యాంటిసెప్టిక్, యాంటీబయాటెక్, విటమిన్ బి 1, విటమిన్ బి 6 కూడా సమృద్ధిగా ఉంటాయి. తేనె సేవించడం ద్వారా కంటి చూపు పెరుగుతుంది.. కఫం, ఉబ్బసం, అధిక రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్న తేనెను వేడి పాలలో కలిపి తీసుకోవడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా.. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి..

ఆరోగ్య ప్రయోజనం….

పాలు,తేనె ఒక క్లాసిక్ కలయిక. వేడి పాలలో తేనె కలిపి తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీంతోపాటు నాడీ కణాల సమస్యలుంటే.. అవి దూరమై.. నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది.ఇందులో ఎన్నో ఔషధ గుణాల ఉండటం వల్ల ఔషధ తయారీకి కూడా ఉపయోగపడతాయి. పాలలో చక్కెరకు బదులుగా ఒక చెంచా తేనె తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఎముకలు బలంగా చేస్తుంది…

మనం తీసుకునే ఆహారంలో కాల్షియం అత్యంత ఎక్కువగా లభించేవాటిలో పాలు ఒకటి. ఇది మీ ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇందులో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే ముఖ్యమైన పోషకం. ఎముకలు బలంగా తయారుకావడానికి వేడి పాలలో తేనె కలుపుకోని తాగితే ప్రయోజనం.

పిరితిత్తులకు మేలు చేస్తుంది…

పాలతోపాటు తేనె తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉంటాయి. వెచ్చని పాలు తాగడం వల్ల శ్వాసకోశ వ్యాదుల సంక్రమణ తగ్గుతుంది. గొంతు నొప్పిని తగ్గించడంలో ఇది సమర్థవంతమైన పని చేస్తుంది.

జీర్ణ సంబంధమైన సమస్యలపై…

గోరు వెచ్చని పాలు తేనె మిశ్రమంలో యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. కడుపు ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతాయి. ఇది మంచి గట్ బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడుతుంది. ఏదైనా జీర్ణ సంబంధమైన వ్యాధుల నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపడటానికి వేడి పాలలో క్రమం తప్పకుండా తేనె కలుపుకోని సేవించాలి. ఇది మలబద్దకాన్ని దూరం చేస్తుంది.

నిద్రను మెరుగుపరుస్తుంది….

గోరు వెచ్చని పాలలో తేనె కలుపుకుని తాగితే మెదడును ప్రశాంతంగా పని చేస్తుంది. మంచిగా నిద్రపోవడానికి వెచ్చని పాలలో తేనె కలిపి తాగడం వల్ల మంచిగా నిద్రపడుతుంది. నిద్రపోవడానికి ఒక గంట ముందు వెచ్చని పాలలో తేనె కలిపి తాగాలి. ఇది మంచి నిద్రను ఇస్తుంది.

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది…

పాలలో తేనె కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను తొలగించడానికి సహాయ పడుతుంది.

పాలు, తేనె యొక్క అపోహలు

వేడి పానీయంలో తేనె కలపడం ద్వారా ఇది విషపూరితంగా మారుతుందని చాలా మంది నమ్ముతారు. అందువల్ల తేనెను వేడి చేయకపోవడమే మంచిది. పాలను మరిగించిన తర్వాత ఓ పది నిమిషాల పాటు చల్లబరచండి ఆ తర్వాత మీరు అందులో తేనె కలపడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి :