AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anjeer Benefits: రోజూ ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే సులభంగా బరువు తగ్గుతారు.. డయబెటీస్ రోగులకు ఎన్నో ప్రయోజనాలు..

ప్రస్తుతం కరోనా క్లిష్ట పరిస్థితులలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అతి ముఖ్యమైన పని. ఎలాంటి వ్యాధులు లేనివారు కరోనా నియంత్రణకు అనేక

Anjeer Benefits: రోజూ ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే సులభంగా బరువు తగ్గుతారు.. డయబెటీస్ రోగులకు ఎన్నో ప్రయోజనాలు..
Anjeer Fruits
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2021 | 12:40 PM

Share

ప్రస్తుతం కరోనా క్లిష్ట పరిస్థితులలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అతి ముఖ్యమైన పని. ఎలాంటి వ్యాధులు లేనివారు కరోనా నియంత్రణకు అనేక రకాల ఆహార పదార్థాలను, కషాయాలను తీసుకోవచ్చు. కానీ.. ఇతర వ్యాధులు ఉన్నవారు కషాయాలు ఎక్కువగా తీసుకోవడం కొంత వరకు ఆలోచించాల్సిన విషయమే. ఇదిలా ఉంటే.. అంజీర్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో ఈ పండ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందులో జింక్, మాంగనీస్, మెగ్నీషియం, ఇనుము వంటి ఖనిజాలు పోషకాలు కలిగి ఉంటాయి. రోజూ నానబెట్టిన అంజీర్ పండ్లను తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. రాత్రిళ్లు ఒకటి లేదా రెండు అంజీర్ పండ్లను నానబెట్టి.. ఉదయాన్నే పరగడపున తీసుకోవడం వలన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. పీఎంఎస్ సమస్యతో బాధపడుతున్న మహిళలకు ఆంజీర్ పండ్లు మేలు చేస్తాయి. అలాగే హార్మోన్ల అసమతుల్యతను, మెనోపాజ్ సమస్యలకు ఆంజీర్ పండ్లు తినడం మంచింది.

షుగర్ లెవల్స్ కంట్రోల్.. ఆంజీర్ పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో షుగర్ లెవల్స్ నియంత్రిస్తుంది. ఇందులో ఉండే.. క్లోరోజెనిక్ ఆమ్లం షుగల్ లెవల్స్ తగ్గించడంలో సహాయపడుతుందని అనేక అధ్యాయనాల్లో తెలీంది. నానబెట్టిన ఆంజీర్ పండ్లను తినడం వలన టైప్ 2 డయాబెటిస్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కూడా నియంత్రిస్తుంది.

మలబద్ధకాన్ని నివారిస్తుంది… ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. ఆంజీర్ పండ్లను ఎక్కువగా తినడం వలన ఆరోగ్యకరమైన గట్ ను కాపాడుకోవచ్చు.

బరువు తగ్గిస్తుంది.. బరువు తగ్గడంలో కోసం డైటింగ్ చేస్తున్న వారు ఆంజీర్ పండ్లను తినడం మంచిది. ఇందులో ఉంటే ఫైబర్ బరువు తగ్గించడంలో సహయపడుతుంది. ఇందులో తక్కువగా కేలరీలు ఉంటాయి. కానీ ఆంజీర్ పండ్లను మితంగా తీసుకోవాలి.. మరీ ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు.

గుండె ఆరోగ్యానికి.. ఆంజీర్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడంలో ఆంజీర్ పండ్లు సహయపడతాయని అధ్యాయనాలు చెబుతున్నాయి.

ఎముకలు ఆరోగ్యం.. ఇందులో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహయపడతాయి. శరీరంలో స్వయంగా కాల్షియం ఉత్పత్తి కాదు.. అందుకే పాలు, సోయా, పచ్చి ఆకు కూరలు, ఆంజీర్ పండ్లు తీసుకోవడం మంచిది.

Also Read: AP CM Jagan: ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ టూర్.. విజయవాడకు తిరుగు పయనం.. రెండు రోజుల్లో ఆరుగురు మంత్రులతో భేటీ!

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..